Crime news: ఇంటర్ విద్యార్థితో కలిసి.. మహిళా లెక్చరర్ పరారీ.. విచారణలో షాకింగ్ విషయాలు
సమాజంతో ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న వారూ కొన్ని సార్లు నేరాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు దారితప్పుతున్నారు. విద్యార్థులు వక్రమార్గంలో నడవకుండా వారిని...
సమాజంతో ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న వారూ కొన్ని సార్లు నేరాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు దారితప్పుతున్నారు. విద్యార్థులు వక్రమార్గంలో నడవకుండా వారిని మార్గదర్శనం చేయాల్సిన వారే సమాజంలో తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ కోపాన్ని తెప్పిస్తుంది. కళాశాలలో పాఠాలు బోధించాల్సిన లేడీ టీచర్(Lecturer) ఇంటర్ విద్యార్థితో పరిచయం పెంచుకుని, చనువు పెంచుకుంది. అనంతరం అతనితో కలిసి పరారైంది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో (Complaint) అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో(Tamilanadu) ని తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఓ విద్యార్థి ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో ఓ మహిళ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా విద్యార్థి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం విద్యార్థి తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెతికారు. అయినా జాడ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళాశాలలో జరిపారు.
ఈ విచారణలో వారికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. విద్యార్థిలాగే అదే కళాశాలలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్ కూడా అదృశ్యం కావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. విద్యార్తితో చనువు పెంచుకున్న లెక్చరర్ అతనితో కలిసి పరారైనట్లు గుర్తించారు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. లెక్చరర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also Read
Viral Photo: తెల్ల గౌనులో దేవ కన్యలా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాల కలల రాణి.. ఎవరో చెప్పుకోండి..
Truecaller: యూజర్లను ఆకట్టుకునేందుకు ట్రూకాలర్ మరో అడుగు.. ఆకట్టుకునే మరో నాలుగు కొత్త ఫీచర్లు..
Toddler Skin Care: మీ పిల్లల మొఖంపై మచ్చలు వస్తున్నాయా? అయితే, ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండండి..