AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duvvada Family Controversy: రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్‌.. అంతులేని కథలా దువ్వాడ ఎపిసోడ్‌.. ఆ రోజున ఏం జరిగింది..?

మరోసారి దువ్వాడ ఫైల్స్‌ మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా మారింది. సినిమాను మించిన ట్విస్ట్‌.. సీరియళ్లను తలదన్నే హైడ్రామాతో ఫ్యామిలీ రగడ కంటిన్యూ అవుతోంది. అయితే ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్‌ వేరు.. ఇకపై జరగబోయే ట్విస్టుల రేంజ్‌ వేరు. తాజాగా ఈ వివాదంలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ట్విస్ట్ రివీల్ అయింది.

Duvvada Family Controversy: రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్‌.. అంతులేని కథలా దువ్వాడ ఎపిసోడ్‌.. ఆ రోజున ఏం జరిగింది..?
Duvvada Family Controversy
Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2024 | 9:13 AM

Share

అంతులేని కథలా సాగిన టీవీ సీరియళ్లకు సైతం శుభం కార్డు పడుతోంది గానీ.. టెక్కలి థియేటర్‌లో ఆడుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఎండ్‌కార్డు పడ్డం లేదు. పూటకో మలుపు.. రోజుకో ట్విస్ట్‌ అన్నట్టుగా.. కథ కొనసాగుతోంది. ఎండ్ కార్డ్ పడుతుంది అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ట్విస్ట్‌తో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ట్విస్ట్ రివీల్ అయింది. ఇటీవల మాధురికి జరిగిన యాక్సిడెంట్‌ని సూసైడ్‌ అటెమ్డ్‌గా క్రియేట్‌ చేసేందుకు దువ్వాడ శ్రీనివాస్‌ ప్రయత్నించారని… మాధురి కోసం కట్టుకున్న భార్యపై అబద్ధాలు చెప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ వాణి. దువ్వాడ శ్రీనును ఎమ్మెల్సీ పదవి నుంచి టెర్మినేట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ జరుగుతున్న టైంలోనే మాధురికి కారు ప్రమాదం జరిగింది. అయితే ఇది ప్రమాదం కాదు.. తానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు, దానికి వాణే కారణమని మధురి చెప్పారు. అయితే, ఈ క్రమంలోనే ఓ ఆడియో సెన్సెషనల్ గా మారింది..  ఇది ప్రమాదం కాదని ఆత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నించినట్టు చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నట్టు వైరల్‌ ఆడియోలో ఉంది. మధురికి యాక్సిడెంట్‌ జరిగితే దాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించి తనను ఇరికించే ప్రయత్నించారని వాణి పేర్కొంటున్నారు. అయితే ఆ ఆడియోలో ఉన్నది తన వాయిస్‌ కాదంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. అసలు ఆ ఆడియో ఎలా వచ్చింది..? ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారో తేల్చాలంటున్నారు.

ప్రమాదాన్ని సూసైడ్ అని చెప్పించి తనపై నిందలు వేస్తున్నారని వాణి పేర్కొన్నారు. శ్రీనును MLC పదవి నుంచి టెర్మినేట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అయితే.. వైరల్‌ అవుతున్న ఆడియో ఫేక్‌ అంటూ దువ్వాడ శ్రీను పేర్కొన్నారు. అది తన వాయిస్‌ కాదన్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తంగా ఇది..! దువ్వాడ దుమారంలో ట్విస్టులు, మలుపులు ఆసక్తిగా మారుతున్నాయి. ఇలా ఎండ్‌కార్డు ఎప్పుడు పడుతుందో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో