Video: దిల్‌ ఖుష్‌ చేస్తున్న ప్రకృతి అందాలు.. వర్షాలతో జలపాతాలకు కొత్త శోభ

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. వాయుగుండం ఎఫెక్ట్‌తో కురుస్తున్న వర్షాలతో జలపాతాలకు కొత్త శోభ వచ్చింది. ప్రకృతి అందాల కనువిందు చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున జలపాతాలను వీక్షించేందుకు క్యూ కుడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి..

Video: దిల్‌ ఖుష్‌ చేస్తున్న ప్రకృతి అందాలు.. వర్షాలతో జలపాతాలకు కొత్త శోభ
Water Fall Video
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 17, 2024 | 8:21 AM

వాయుగుండం ఎఫెక్ట్‌తో జోరుగా కురుస్తున్న వర్షాలకు… జలపాతాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. జలసవ్వడితో ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇటు తిరుమలగిరులు కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంటే….అటు నెల్లూరు జిల్లాలోని ప్రకృతి అందాలు రారమ్మంటున్నాయి. దంచికొడుతున్న వర్షాలతో… ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవటంతో తిరుమల పరిసరాలు సరికొత్తగా కనిపించాయి. జడివానలో తిరుమల గిరుల అందాలు కనువిందు చేశాయి. వర్షంలో శ్రీవారి ఆలయ పరిసరాలను తనివితీరా ఆస్వాదించారు శ్రీవారి భక్తులు.

ఓ పక్క వెంకన్న నామస్మరణ.. మరోపక్క మనసును ఆహ్లాదపరిచే జడివానలో శ్రీవారి భక్తులు పరవశించిపోయారు. తిరుమల అందాలను వీడియోలు, ఫోటోల్లో బంధించారు. భక్తి భావం.. ప్రకృతి అందాలన్ని ఒకేచోట రాశి పోయినట్లుగా కనువిందు చేస్తున్న తిరుమల గిరులు కళ్లు తిప్పుకోనివ్వటంలేదంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు భక్తులు. ఇక గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన అడవులు… పారే సెలయేళ్లు, దుమికే జలపాతాలతో అందాలను వలకపోస్తున్నాయి. సెలయేర్లు తెల్లటి నురుగులు కక్కుతూ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాదకరణ వాతావరణాన్ని పంచుతున్నాయి. ఈ అందాలను తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

భారీ వర్షాలకు ఇటు వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండలు… అద్భుతంగా కనిపిస్తున్నాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తున్నాయి. మొత్తంగా వాయుగుండం ప్రభావంతో దంచికొడుతున్న వర్షాలు… ప్రకృతిని అందాలను చూపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల దిల్‌ ఖుష్‌ చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..