Diviseema Uppena: సముద్రుడు రాసిన రక్త చరిత్ర.. దివిసీమ ఉప్పెనకు 46 ఏళ్లు.. నేటికీ స్థానికులకు ఈ రోజు కాళరాత్రే..

చరిత్ర పుటలను తిప్పితే.. దివిసీమ ఉప్పెన రాసిన రక్త చరిత్ర నవంబర్‌ 19, 1977 నాడు ప్రత్యక్షమవుతుంది. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు.. దివిసీమపై ప్రకృతి చేసిన మృత్యు సంతకానికి చిహ్నం ఆ రోజు. సముద్రం జల ఖడ్గం దూసి రాకాసి అలల రూపంలో విరుచుకు పడితే ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న దివిసీమ ఉప్పెన విషాదం.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. భారత దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం అని చెబుతారు.

Diviseema Uppena: సముద్రుడు రాసిన రక్త చరిత్ర.. దివిసీమ ఉప్పెనకు 46 ఏళ్లు.. నేటికీ స్థానికులకు ఈ రోజు కాళరాత్రే..
Diviseema Uppena
Follow us

|

Updated on: Nov 19, 2023 | 8:24 AM

మానవుడికి జీవితాన్ని ఇచ్చే ప్రకృతికి కోపం వస్తే.. భారీ వర్షాలు, వరదలు, ఉప్పెనలు, సునామీలు, భూకంపాలు వంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మానవ జీవితాలను భయబ్రాంతులకు గురించి చేస్తుంది. అలాంటి సంఘటనలు ఎన్ని ఏళ్లు అయినా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనలుగా నిలిచిపోతాయి. అలాంటిదే దివిసీమ ఉప్పెన. ఈ ఘటన గుర్తుకొస్తే చాలు.. ఎవరికైనా కనురెప్పల మాటున దాగిన కన్నీళ్ల ఉప్పెన కట్టలు తెంచుకుంటుంది. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న ఆ మహా విషాదం జరిగి నేటితో 46 ఏళ్లు పూర్తి అయ్యాయి.

అది కాళరాత్రి. సముద్రం మృత్యువులా మారి కాటేస్తే.. ఉప్పెన రూపంలో ముంచుకొస్తే.. ఎలా ఉంటుందో ఆనాటి రాత్రి కళ్లారా చూశారు దివిసీమ వాసులు. తెల్లారి లేచి చూసిన తర్వాత మనిషి కనిపిస్తే బతికి ఉన్నట్లు.. లేకుంటే చనిపోయినట్లు అని ప్రజలు అనుకున్నారంటే అదెంత మహా విషాదమో అర్థమవుతుంది. చరిత్ర పుటలను తిప్పితే.. దివిసీమ ఉప్పెన రాసిన రక్త చరిత్ర నవంబర్‌ 19, 1977 నాడు ప్రత్యక్షమవుతుంది. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు.. దివిసీమపై ప్రకృతి చేసిన మృత్యు సంతకానికి చిహ్నం ఆ రోజు. సముద్రం జల ఖడ్గం దూసి రాకాసి అలల రూపంలో విరుచుకు పడితే ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న దివిసీమ ఉప్పెన విషాదం.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. భారత దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం అని చెబుతారు. వేలాదిమందికి నూరేళ్లు నిండేలా చేసిన ఆ మహా విషాదానికి నేటితో 46 ఏళ్లు నిండాయి.

ఆనాడు పెను తుఫాను విరుచుకుపడితే, సముద్రం ఉప్పొంగి ఊళ్ల మీద పడితే, తాటి చెట్టు ఎత్తులో రాకాసి అలలతో ముంచేస్తే.. 10వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 30 వేలకు పైమాటే. ఇక మూగ జీవాలు లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఆనాడు అండ‌మాన్ స‌మీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌.. క్రమేపీ బ‌ల‌ప‌డుతూ.. భ‌యంక‌ర ఉప్పెన‌గా మారింది. ఆ ముందు రోజు రాత్రి స‌ముద్రుడు ఎంతో ప్రశాంతంగా క‌న‌బడడంతో .. ఎవ్వరికీ అనుమానం రాలేదు.. అది భారీ విధ్వంసాన్ని సృష్టించే పెను తుఫానుకి ముందు ప్రశాంత‌త అని..

ఇవి కూడా చదవండి

ఈ ఉప్పెన దాడికి తీర ప్రాంత గ్రామాలైన సొర్ల‌గొంది, మూల‌పాలెం, దిండి, సంగ‌మేశ్వరం, నాలి లాంటి గ్రామాలు నామ‌రూపాల్లేకుండా పోయాయి. ఉప్పెన విధ్వంసానికి కొట్టుకు వ‌చ్చిన శ‌వాలు గుట్టలు గుట్టలుగా క‌న‌బ‌డేవ‌ట‌. దాదాపు కొన్నినెల‌ల పాటు మృతదేహాలు ఏదో ఒక మూల దొరుకుతూనే ఉండేవంటే అల‌నాటి విధ్వంసం ఎంత భ‌యాన‌క‌మో అర్ధం చేసుకోవాల్సిందే..

దివిసీమ ప్రారంభంలో త‌మ ప్రాంతంపై దాడి చేసిన రాకాసి అల‌ల ఎత్తుకి ప్రతిబింబంగా ఓ స్థూపం క‌ట్టించారు. సొర్ల‌గొంది గ్రామంలో శ‌వాల‌ను తొల‌గిస్తున్న పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఏటా న‌వంబ‌ర్ 19… ఆయా గ్రామాల ప్రజలకు నిద్ర లేని రాత్రినే మిగులుస్తుంది. ఎన్ని ఏళ్లు గడిచినా స్థానికుల మదిలో స‌ముద్రుడు ఎక్కడ దాడి చేస్తాడోన‌న్న భ‌యం కలుగుతూనే ఉంది. జనం రాత్రంతా జాగారం చేస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాజాలో తొలిసారి నెతన్యాహు పర్యటన.! ఇజ్రాయెల్‌ సైన్యంలో స్ఫూర్తి..
గాజాలో తొలిసారి నెతన్యాహు పర్యటన.! ఇజ్రాయెల్‌ సైన్యంలో స్ఫూర్తి..
భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. వీడియో
భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. వీడియో
కొత్త రకం ఇన్ఫెక్షన్లతో ఇండియాలో టెర్రర్..!
కొత్త రకం ఇన్ఫెక్షన్లతో ఇండియాలో టెర్రర్..!
ఫ్లూ, వైరల్ జ్వరం, న్యుమోనియా.. ఈ మూడింటి మధ్య తేడా ఏంటంటే..
ఫ్లూ, వైరల్ జ్వరం, న్యుమోనియా.. ఈ మూడింటి మధ్య తేడా ఏంటంటే..
ఆ అనుమానమే నిజం కానుందా..? సలార్ సినిమా ఆ సినిమాకు రీమేక్‌ .?
ఆ అనుమానమే నిజం కానుందా..? సలార్ సినిమా ఆ సినిమాకు రీమేక్‌ .?
అయోధ్య రాముడికి అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం. వీడియో.
అయోధ్య రాముడికి అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం. వీడియో.
కొనసాగుతున్న ఉత్తరకాశీ సొరంగంలో డ్రిల్లింగ్‌ పనులు.. వీడియో.
కొనసాగుతున్న ఉత్తరకాశీ సొరంగంలో డ్రిల్లింగ్‌ పనులు.. వీడియో.
ప్రత్యేక రైలులో అస్వస్థతకు గురైన ప్రయాణికులు
ప్రత్యేక రైలులో అస్వస్థతకు గురైన ప్రయాణికులు
వైజాగ్ వేదికగా ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేసిన కిర్రాక్ ఆర్పీ
వైజాగ్ వేదికగా ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేసిన కిర్రాక్ ఆర్పీ
ప్రభాస్ స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఆ హీరోతో సినిమా ..
ప్రభాస్ స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఆ హీరోతో సినిమా ..
గాజాలో తొలిసారి నెతన్యాహు పర్యటన.! ఇజ్రాయెల్‌ సైన్యంలో స్ఫూర్తి..
గాజాలో తొలిసారి నెతన్యాహు పర్యటన.! ఇజ్రాయెల్‌ సైన్యంలో స్ఫూర్తి..
భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. వీడియో
భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. వీడియో
అయోధ్య రాముడికి అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం. వీడియో.
అయోధ్య రాముడికి అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం. వీడియో.
కొనసాగుతున్న ఉత్తరకాశీ సొరంగంలో డ్రిల్లింగ్‌ పనులు.. వీడియో.
కొనసాగుతున్న ఉత్తరకాశీ సొరంగంలో డ్రిల్లింగ్‌ పనులు.. వీడియో.
బావిలో పడి ట్రాక్టర్‌ నుజ్జు నుజ్జు... కాని ..
బావిలో పడి ట్రాక్టర్‌ నుజ్జు నుజ్జు... కాని ..
సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో
సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో
తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక
తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక
చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్‌
చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్‌
గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు
గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు
ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు
ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు