Anantapur: ఫ్యామిలీ మీద కోపంతో ఎత్తైన కొండెక్కిన వ్యక్తి.. 5 గంటలు కష్టపడి రక్షించిన పోలీసులు
అంత పెద్ద కొండపైకి అతను ఎలా ఎక్కడా అని పోలీసులు జుట్టుపీక్కుకున్నారు. ఇదిలావుంటే.. అదే కొండపై గతంలో చిరుత పులులు, ఎలుగుబంట్లు సంచరించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఈ క్రమంలోనే.. క్రూర మృగాలు ఆ వ్యక్తి వద్దకు వెళ్లకుండా.. అతనికి దగ్గర్లో హై మాస్క్ లైట్లతోపాటు.. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. అనంతరం దాదాపు ఐదు గంటల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు చిట్ట చివరకు కొండ మీద చిక్కుకున్న వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఓ వ్యక్తి కొండమీద చిక్కుకుపోవడం కలకలం రేపింది. మడకశిర కొండ పైకి వెళ్లిన వ్యక్తి అక్కడ నుంచి కొండ పైకి ఎక్కలేక.. తిరిగి కిందకు దిగలేక మధ్యలోనే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని కొండపై నుంచి దించేందుకు చర్యలు చేపట్టారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించేటప్పటికే చీకటి పడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎత్తైన కొండ కావడంతో వ్యక్తిని కిందికి క్షేమంగా దింపేందుకు పోలీసులకు కష్టపడాల్సి వచ్చింది. అయితే.. అంత పెద్ద కొండపైకి అతను ఎలా ఎక్కడా అని పోలీసులు జుట్టుపీక్కుకున్నారు. ఇదిలావుంటే.. అదే కొండపై గతంలో చిరుత పులులు, ఎలుగుబంట్లు సంచరించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఈ క్రమంలోనే.. క్రూర మృగాలు ఆ వ్యక్తి వద్దకు వెళ్లకుండా.. అతనికి దగ్గర్లో హై మాస్క్ లైట్లతోపాటు.. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు పోలీసులు.
అనంతరం దాదాపు ఐదు గంటల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు చిట్ట చివరకు కొండ మీద చిక్కుకున్న వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు. అయితే ఆ వ్యక్తిని తాళ్ళ సహాయంతో కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ సమయంలో ఆ వక్తి కాలు జారి కొండ మీద నుంచి కొంత మేర కిందకు జారి పడ్డారు. తలకు గాయం కావడంతో పోలీసులు వెంటనే ఫస్టైడ్ చేశారు. అనంతరం కొండ మీద చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు, స్థానికులు కలిసి సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.
ఇతడిని కర్ణాటక రాష్ట్రం హెబల్ కు చెందిన హనుమంత గౌడ గా గుర్తించారు పోలీసులు. కొండ మీద నుంచి కిందకు తీసుకొచ్చే క్రమంలో జారి పడి హనుమంత గౌడకు గాయాలవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిచారు. తాపీ పని కోసం హనుమంత గౌడ తన సొంత ఊరు నుంచి మడకశిర వచ్చినట్లు చెప్పారు. ఫ్యామిలీ గొడవలతో ఇంట్లో నుంచి వచ్చేసినట్లు.. అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..