వామ్మో.. సంక్రాంతి పందెం కోళ్లకు ఇన్ని రాజభోగాలా.? పెద్ద కథే ఉందండోయ్‌..

ప్రస్తుతం సంక్రాంతి అంటే కోడి పందాలు అనే విధంగా ట్రెండ్ మారిపోయింది. సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం వస్తున్నారంటే కోడి పందెలాకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగ మూడు రోజులు.. కోడిపందాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. మరో రెండు నెలలలో సంక్రాంతి రానుంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు...

వామ్మో.. సంక్రాంతి పందెం కోళ్లకు ఇన్ని రాజభోగాలా.? పెద్ద కథే ఉందండోయ్‌..
Sankranti Pandem Kollu
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Nov 18, 2023 | 6:41 PM

తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ప్రతి ఏటా సంక్రాంతికి చిన్న, పెద్ద, ఊరు వాడ అంతా ఏకమై పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. నగరాల్లో ప్రజలు ముందుగానే సంక్రాంతికి తమ సొంత ఊర్లకు వెళ్లి పండుగ మూడు రోజులు రోజులు ఆనందంగా ఉండేందుకు ఎంతో ప్లాన్ చేసుకుంటారు. సాధారణంగా సంక్రాంతి అంటే భోగి మంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్లు కామన్‌గా ఉండే అంశాలు.

ప్రస్తుతం సంక్రాంతి అంటే కోడి పందాలు అనే విధంగా ట్రెండ్ మారిపోయింది. సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం వస్తున్నారంటే కోడి పందెలాకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగ మూడు రోజులు.. కోడిపందాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. మరో రెండు నెలలలో సంక్రాంతి రానుంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు పోటీలో దింపేందుకు ఇప్పటినుంచే పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కోడి పందాలు లేకుండా సంక్రాంతి జరగదు అనే ట్రెండ్ జనాల్లో బాగా నాటుకుపోయింది. వచ్చే సంక్రాంతికి ఇప్పటికే పందెం పుంజులు సిద్ధం చేస్తూ వాటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు పందెం రాయుళ్లు. ఒక్కో కోడిపుంజు తయారీకి సుమారు రూ. 25 వేల వరకు ఖర్చవుతుంది. అలా తయారైన కోడిపుంజులను రంగు, పోరాట పటిమను బట్టి రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తుంటారు.

పందెం పుంజుల పెంపకం, పోషణ..

పందెం పుంజుల పెంపకం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ముందుగా విశాలమైన ఖాళీ ప్రదేశంలో వాటి పెంపకానికి అనువైన షెడ్లు నిర్మిస్తారు. ఆ తరువాత శ్రేష్టమైన జాతులకు చెందిన కోడి పెట్టల నుంచి గుడ్లు సేకరించి వాటిని పిల్లలుగా పొదిగిస్తారు. పిల్ల దశ నుంచి ఒక్కొ పుంజుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ సుమారు ఆరు నెలల వరకు వాటిని గుంపులోనే ఉంచుతారు. ఆ తర్వాత పుంజు తయారీ ప్రారంభంలో వాటి ఎత్తు, బలం, రంగు, పోరాట పటిమ ఆధారంగా వాటిని గుంపులో నుంచి వేరుచేసి ఒక్కొక్క దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుతారు. అవి అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు పరీక్షించి నాణ్యమైన మందులు ఇస్తారు. మేత కూడా నిర్ణీత మైన సమయంలో ప్రతిరోజు ఒకే సమయానికి నిర్దిష్ట ప్రమాణంలో వాటికి కావాల్సిన పోషక విలువలు ఉండే ఆహారాన్ని మాత్రమే ఇస్తుంటారు.

ముఖ్యంగా సంక్రాంతి రెండు నెలలు ముందు నుంచి ప్రత్యేక శిక్షణ, మేత ఇస్తారు. అందులో భాగంగానే ఉదయం ఉడికించిన కోడిగుడ్డుపై తెల్లటి పదార్థాన్ని తినిపిస్తారు. ఆ తరువాత వాటికి బరిలో పోటీ సమయంలో అలసట లేకుండా ఉండేందుకు ఉదయాన్నే వాకింగ్, రన్నింగ్ చేయిస్తారు. చల్లటి నీటిలో శరీరం దృఢపడేలా స్విమ్మింగ్ చేయిస్తారు. ఆ తర్వాత పోషకాలు ఎక్కువగా ఉండే బాదం, పిస్తా, జీడిపప్పును మేతగా వేస్తారు. పోరాట సమయంలో గాయాలు తట్టుకునీ నిలబడే విధంగా శరీరం దృఢంగా వుండేలా వేడి నీటి ఆవిరిసెగతో కాకలు తీయిస్తారు. ఆ తరువాత యాట మాంసాన్ని గుండ్రని ఉండలుగా చేసి వాటికి తినిపిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే సంక్రాంతికి ముందు రెండు నెలలు కూడా పందెం పుంజులు రాజభోగాలు అనుభవిస్తాయి.

Swimming

కడుపున పుట్టిన బిడ్డలను కూడా తల్లిదండ్రులు అంత ప్రేమగా చూడరంటే అతిశయోక్తి కాదు.. అలా బరిలో పందాల కోసం తయారుచేసిన కోళ్లకు ఉదయం, సాయంత్రం ఇతర కోళ్లతో పోటీలు వేసి వాటి శక్తి సామర్థ్యాలు పరీక్షిస్తారు. ఒక్కో కోడిపుంజు తయారీకి సుమారు రూ. 10 వేల నుండి రూ. 25 వేలు ఖర్చవుతుంది. కొందరు కుటుంబ పోషణ నిమిత్తం పందెం పుంజుల పెంపకం చేపడితే, మరికొందరు సంక్రాంతికి జరిగే కోడిపందాల కోసం సిద్ధం చేస్తున్నారు. తయారుచేసిన కోడిపుంజులకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది. ఒక్కో పుంజు రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పలుకుతుంది.

పందెం పుంజుల జాతులు, రంగులు..

కోడి పందాల కోసం దేశ వాళీ కోడిపుంజులతో పాటు విదేశీ కోడిపుంజుల సైతం పెంచుతున్నారు. దేశవాళీ కోడిపుంజులను వాటి రంగుల్ని భట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా కాకి, నెమలి, డేగ, సెతువా, పచ్చ కాకి, రసింగి, మైలా, ఇలా రకరకాల పేర్లతో వాటిని పిలుస్తారు. నల్లటి ఈకలు కలిగి ఉన్న కోడిపుంజును కాకి అంటారు. అదేవిధంగా రెక్కలు, శరీరంపై తెల్ల ఈకల ఉండి క్రింద భాగంలో నీలవర్ణంలో ఈకలు ఉన్న కోడిపుంజును నెమలి అంటారు. అలాగే తేనె వర్ణంలో రంగు గల ఈకలు ఉన్న కోడిపుంజుని రసింగి అంటారు. అదేవిధంగా ఎర్రటి రంగులో ఈకలు కలిగి ఉన్న కోడిపుంజును డేగ అనీ పిలుస్తారు. ఎర్రటి ఈకలు, అక్కడక్కడ నలుపు ఈకలు ఉన్న కోడిపుంజును పచ్చ కాకి అని పిలుస్తారు.

Eggs

పూర్తిగా తెలుపు రంగులో ఈకలు ఉన్న కోడిపుంజును సేతువా అంటారు. అలాగే బూడిద వర్ణంలో ఈకలు కలిగి ఉన్న కోడిని మైలా అని పిలుస్తారు. ఇక చూడడానికి కోడి పెట్టలాగా ఉండే కోడిపుంజును పెట్టమారు అంటారు. ఇవే కాక ఇంకా పలు రకాల పేర్లతో పందెం పుంజులను పిలుస్తారు. వాటి రంగుల బట్టి కూడా వాటి ధర ఆధారపడి ఉంటుంది. ఇటీవల విదేశీ జాతులైన పెరు, ఫిలిప్పైన్ కోడిపుంజుల సైతం పందాల కోసం గోదావరి జిల్లాలలో ఎక్కువగా పెంచుతున్నారు. ఎందుకంటే ఆ కోళ్లు ఎంతో వేగంగా పోరాడే శక్తి ఉంటుంది. త్వరగా అలసిపోవు. దాంతో వాటిని పెంచడానికి పందెం రాయుళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.

కోడిపందాలు జరిగే ప్రాంతాలివే..

ముఖ్యంగా గోదావరి జిల్లాలలో జరిగే కోడిపందాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పండగ మూడు రోజులు కోడి పందాలు జరిగే సమీప పట్టణాల్లో రూమ్స్‌, రెస్టారెంట్స్‌ అస్సలు ఖాళీగా ఉండవు. ఇప్పటినుంచే ముందుగా సంక్రాంతికి ప్రముఖ హోటల్లో రూములు బుక్ చేసుకుంటారు పందెం రాయుళ్లు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతికి 150 నుంచి 200 వరకు పందాల బరులు సిద్ధమవుతాయి. భీమవరం, కాళ్ళ, ఉండి, నిడమర్రు, పాలకోడేరు మండలాల్లో పెద్ద ఎత్తున పందాలు జరుగుతాయి. ఈ పందాలను తిలకించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరవుతుంటారు.

వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా పందెం రాయుళ్లు చేస్తారు. గత రెండు సంవత్సరాలుగా వీఐపీల కోసం కోడి పందెం బరుల వద్ద కారవ్యాన్లు సైతం సిద్ధం చేస్తున్నారంటే వాటి డిమాండ్ ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు. బరిని బట్టి రూ.1 లక్ష నుంచి 25 లక్షల వరకు ఒక్కో కోడి పందెం జరుగుతుంది. అదేవిధంగా గణపవరం, ఉంగుటూరు, భీమడోలు, ద్వారకా తిరుమల, దెందులూరు మండలాలతో పాటు మెట్ట ప్రాంతమైన లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల్లో పెద్ద ఎత్తున ఈ కోడిపందాలు నిర్వహిస్తారు. గోదావరి జిల్లాలలో జరిగే మూడు రోజుల కోడి పందేలలో సుమారు రూ.200 కోట్లు చేతులు మారతాయని ప్రచారం కూడా ఉంది.

Pandem Kodi

కోడిపందాలలో కుక్కుట శాస్త్రo ప్రాముఖ్యత..

ముఖ్యంగా కోడిపందాలు గురించి చెప్పుకోవాల్సిన విషయాలలో కుక్కుట శాస్త్రం చాలా ప్రధానమైనది. ఎందుకంటే మనుషులకి ఒక శాస్త్రం ఉన్నట్టు కోళ్లకు కూడా కుక్కుట శాస్త్రం అందుబాటులో ఉంది.. చాలామంది పందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రాన్ని అనుసరించే పందాలు కాస్తారు. కుక్కుట శాస్త్రంలో కోడి పందాలపై ఎన్నో విషయాలు అందులో ఉంటాయి. కృష్ణపక్షం, శుక్లపక్షం రెండిటినీ కలిపి నెలగా పరిగణిస్తారు. చంద్రుడు పౌర్ణమి తరువాత నుంచి రోజు రోజుకూ ప్రకాశం తగ్గుతూ అమావాస్య రోజున పూర్తిగా క్షీణిస్తాడు. ఈ సమయాన్ని కృష్ణ పక్షం అని అంటారు. అమావాస్య తరువాతి రోజు పాడ్యమి నుంచి మొదలు పౌర్ణమి వరకు గల పదిహేను రోజులను శుక్లపక్షం అని పిలుస్తారు. వీటి ఆధారంగానే కుక్కుట శాస్త్రం పనిచేస్తుంది. పండుగ మూడు రోజులు శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో ఉందా చూసుకుంటారు. అదే విధంగా ఈ జాములో ఏ రంగు పుంజు, ఏ రంగు కోడి పై పందెం వేస్తే గెలుస్తుందో కుక్కుట శాస్త్రంలో ఉంటుంది. మనుషులతో పాటు కోడి పుంజులపై కూడా నక్షత్ర బలం పనిచేస్తుందనీ పందెం రాయుళ్లు నమ్మకం. కుక్కుట శాస్త్రం ప్రకారం ఒక్కో రంగు కోడికి ఒక్కో నక్షత్రం ఉంటుంది.

ఆ నక్షత్ర ప్రభావం భట్టి కూడా కోడిపందాలు వేస్తుంటారు. అదేవిధంగా కుక్కుట శాస్త్రంలో దిక్కులను సైతం లెక్కలోకి తీసుకుంటారు. నక్షత్రం ఆధారంగా ఏ రంగు కోడిని ఏ దిక్కు వైపు నుంచి వదిలితే పందెం గెలుస్తుందో కుక్కుట శాస్త్రంలో పేర్కొన్నారు. దీనిని ఆధారం చేసుకొని చాలామంది పందెం రాయుళ్లు కోడిపందాలు వేస్తుంటారు. ఈ రకంగా పందాలను పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. కోడి పందేల ముందు వరకు పోలీసులు అడపాదడపా బైండోవర్ కేసులు నమోదు చేసి పండగ మూడు రోజులు మాత్రం అటువైపు తలెత్తి కూడా చూడరు. ఎందుకంటే సంక్రాంతి పండగ సమయంలో పందాల విషయంలో పందెం రాయుళ్లు పార్టీలు, కులాలు ఇవేమీ పట్టించుకోరు. అందరు కలిసికట్టుగా ఉంటూ కోడి పందేల పైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకరించి ఉంటారు.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం