Pawan Kalyan: పవన్ తన ఎన్నికల ప్రచార రథానికి ‘వారాహి’ అని ఎందుకు పేరు పెట్టారో తెల్సా..?
ఎన్నికల సమరానికి వారాహి రెడీ. బెల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఎన్నికల సమరానికి సంసిద్దమవుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ట్రైల్ రన్ గమనించిన పవన్ .. వారాహి వెహికల్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు.

ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తా. ఇది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్. యాజ్ టీజ్ గా ఈడైలాగ్ తనకు కరెక్ట్ అని నిరూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ నేతలెవరికీ లేనివిధంగా సరికొత్త ఎన్నికల ప్రచార రథాన్ని స్వయంగా సిద్ధం చేయించారు పవన్ కళ్యాణ్. డిఫెన్స్ వాహనాన్ని పోలిన బస్సును రెడీ చేసుకున్నారు. ప్రచారం రథం ట్రయల్ రన్‌ను హైదరాబాద్‌లో పరిశీలించారు పవన్ కల్యాణ్. ప్రచార రధాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పవన్.. జనసేన పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు చేశారు. వాహనాన్ని తీర్చిదిద్దిన సాంకేతిక నిపుణులతోనూ పవన్ చర్చించారు. ఎన్నిక సమరానికి వారాహి రెడీ అంటూ ఫస్ట్‌లుక్ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. యుద్దంలో నలు దిక్కుల నుంచి కాపాడే వారాహి అమ్మవారి పేరును తన ఎన్నికల ప్రచార రథానికి స్వయంగా నామకరణ చేశారు పవన్ కల్యాణ్. సహజంగా వీఐపీలు వాడే కేర్‌వాన్‌ని ఇలా ఎలక్షన్ క్యాంపెయినింగ్‌కి తన టేస్ట్‌గా తగ్గట్లుగా మలచుకున్నారు పవన్ కల్యాణ్. యుద్ధానికి సన్న్నద్ధమయ్యేందుకు వాడే ఆర్మీ వెహికిల్, వీఐపీ కేర్ వాన్ లను మిక్స్ చేసి వారాహిని సిద్దం చేశారు సాంకేతిక నిఫుణులు.
ఇక వారాహి వాహన విశేషాలను కూడా జనసేన పార్టీ విడుదల చేసింది. పవన్ కల్యాణ్ గత రోడ్ షోలను దృష్టిలో పెట్టుకొని వాహనాన్ని పత్యేకంగా తయారు చేశారు నిర్వాహకులు. వాహనం చుట్టూ ప్రత్యేక లైటింగ్ తో పాటు వెరీ హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను వామనం ఫిట్ చేశారు. సభల్లో పవన్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా లేటెస్ట్ సౌండ్ సిస్టం, వాహనం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌కి రియల్ టైంలో వెళ్లేలా ప్రజెంట్ టెక్నాలజీతో ఉపయోగించారు. వాహనం లోపల పవన్ కల్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా.. అలాగే హైడ్రాలిక్ లిప్ట్ ద్వారా పవన్ వాహనం పైకి చేరుకునేలా సిస్టం అమర్చారు. ఇప్పటికే రెడీ అయిన వారాహి వాహనం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు తర్వాత పవన్ తన పర్యటన స్టార్ చేస్తారని జనసేన పార్టీ తెలిపింది.
వారాహి… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ pic.twitter.com/WJK92cSWh0
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2022
మరిన్ని ఏపీ న్యూస్ కోసం
