Pawan Kalyan: అభివృద్ధివైపుగా పిఠాపురం అడుగులు.. పవన్ కల్యాణ్ నాయకత్వంలో మారుతున్న రూపురేఖలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం కరుణ, బాధ్యత, నిర్ణయాత్మకతతో సమగ్ర అభివృద్ధి సాధిస్తోంది. P4 కార్యక్రమంతో క్యాన్సర్ రహిత నియోజకవర్గ లక్ష్యం, దివ్యాంగులకు జన జీవన ఆధార్ మినీ షాపులతో గౌరవప్రదమైన ఉపాధి, ఉచిత దంత వైద్య సేవలు, విద్యా ప్రోత్సాహం వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు తెస్తోంది. ఇది ఆదర్శ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటోంది.

కరుణ, బాధ్యత, నిర్ణయాత్మక నాయకత్వం అనే మూల సూత్రాలతో అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్న పరిపాలనకు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పదవి బాధ్యలు చేపట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన సొంత నియోగవర్గం అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయన దూరధృష్టి నాయకత్వంలో ప్రస్తుతం పిఠాపురం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.
క్యాన్సర్ నియంత్రిత పిఠాపురం దిశగా
పిఠాపురంలో చేపట్టిన అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమాల్లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ హెల్త్ క్యాంప్ కూడా ఒకటి. ఇది ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమం కింద అమలు అవుతోంది. ముందస్తు ఆరోగ్య సంరక్షణపై పవన్ కళ్యాణ్ దూర దృష్టికి ప్రేరణగా, ఈ కార్యక్రమం నిలుస్తోంది. ఇది STEP మోడల్ – Screening (పరీక్షలు), Treatment (చికిత్స), Education (అవగాహన), Prevention (నివారణ) ఆధారంగా రూపొందించబడింది. వచ్చే ఐదేళ్లలో పిఠాపురాన్ని క్యాన్సర్ నియంత్రిత నియోజకవర్గంగా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఉద్దేశం
ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడే సమస్యను ఎదుర్కొనేందుకు, గ్రామస్థాయిలో విస్తృత స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ సర్జన్ డా. తరుణ్, జి.ఎస్.ఎల్, నియో సంస్థలు, షీ ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించి, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందించేందుకు మొబైల్ మెడికల్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
గౌరవంతో కూడిన ఉపాధి: జన జీవన ఆధార్ మినీ షాపులు
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్థున్న దివ్యాంగుల దృష్టిలో ఉంచుకొని జన జీవన ఆధార్ మినీ షాపులు అనే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. మానవ గౌరవమే కేంద్ర బిందువుగా రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న దివ్యాంగులకు శాశ్వతమైన, గౌరవప్రదమైన ఉపాధి కల్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు డాక్టర్ బుర్ర దివ్య రాజ్ P4 ఫ్రేమ్‌వర్క్ కింద శాశ్వతమైన జిందాల్ స్టీల్ మినీ షాపులను ఏర్పాటు చేశారు. “ఒక చిన్న షాప్ – ఒక కుటుంబానికి ఆశ” అనే నినాదంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నవ్వులను తిరిగి తీసుకొచ్చే మెగా ఉచిత దంత వైద్య మిషన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, గత సెప్టెంబర్‌లో మూడు నెలల పాటు ఉచిత దంత ఆరోగ్య సర్వే అండ్ చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ బుర్ర దివ్య రాజ్, డాక్టర్ గన్ని భాస్కర్ రావు నాయకత్వంలో, జి.ఎస్.ఎల్, నియో సంస్థల సహకారంతో ఈ మిషన్ 25,000 కుటుంబాలు, 35 ప్రభుత్వ పాఠశాలలను చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 6,000 మందికి పైగా రోగులకు ఉచిత దంత చికిత్సలు అందించబడింది. అలాగే నియోజకవర్గంలో మొబైల్ డెంటల్ యూనిట్‌ను ప్రారంభించి, వృద్ధులకు డెంటర్లు, పాఠశాల పిల్లలకు దంత సంరక్షణ కిట్లు స్వయంగా అందజేశారు.
వైద్య విద్య, నాయకత్వానికి బలం
ఆరోగ్య విద్యపై తన నిబద్ధతను మరోసారి చాటుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ లో నిర్వహించిన RAMCOSA 2026 అలుమ్ని సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలుమ్ని నిధులతో నిర్మించనున్న పరిపాలనా భవనానికి శంకుస్థాపన చేసి, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందించేందుకు వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతతో కూడిన వైద్య నాయకత్వం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
సంక్రాంతి 2026: ఆదర్శ నియోజకవర్గం దిశగా విజన్
సంక్రాంతి 2026 సందర్భంగా, పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్న తన దృష్టిని పవన్ కళ్యాణ్ మరోసారి వెల్లడించారు. రూ.211 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. పిఠాపురాన్ని శాశ్వత సంక్రాంతి సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను ప్రకటించి, జూదం, అక్రమ కార్యకలాపాలను నిరుత్సాహపరిచారు. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, పారిశుధ్యం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఫలితాలను అందిస్తున్న పరిపాలనా నమూనా
ముందస్తు ఆరోగ్య సంరక్షణ నుంచి గౌరవప్రదమైన ఉపాధి, విద్య నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనం వరకు, ఈ కార్యక్రమాలన్నీ దూరదృష్టి , అమలుకు మధ్య ఉన్న సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వం, డాక్టర్ బుర్ర దివ్య రాజ్ అలసటలేని క్షేత్రస్థాయి కృషితో, పిఠాపురం భారతదేశంలోనే అత్యంత ప్రగతిశీల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా వేగంగా ఎదుగుతోంది. కరుణతో కూడిన నాయకత్వం, నిర్ణయాత్మక చర్యలే నిజమైన మార్పుకు పునాది అని ఇది నిరూపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
