
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. మే 26న తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్రలో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుందని ఐఎండీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
మే 25 నుంచి 27లోపు ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయన్నారు. ఈ క్రమంలోనే సముద్రంలోకి చేపల వేటకు ఎవరూ వెళ్ళకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు నిషేధ హెచ్చరికలు జారీ చేశారు. యస్ తుఫాన్ గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. అది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో, పారాదీప్‌కి 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read:
చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!
మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!
పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!
వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!