Andhra Pradesh: ‘హలో.. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది, ఓటీపీ చెప్పండి’ మీకూ ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా?
హలో మేము ఫలానా సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మేము రాండమ్‌గా కొన్ని మొబైల్ నెంబర్లను లాటరీ తీశాం. లక్కీగా మీరు ఎంపికయ్యారు. మీకు లక్షల్లో నగదు బహుమతి వస్తుంది. వెంటనే మీకు మేము పంపిన మెసేజ్‌లని ఈ కింది లింక్‌పై క్లిక్ చేసి మీకు వచ్చిన ఓటీపీ నెంబర్‌ను మాకు తెలియచేయండి. వెంటనే మీ ఖాతాకు లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చేస్తుందంటూ తియ్యగా మాట్లాడుతారు. ఓటీపీ చెప్పగానే తన ఖాతాకు డబ్బులు జమకావాల్సిందిపోయి ఖాతా ఖాళీ అయిపోతుంది..

దోర్నాల, డిసెంబర్ 17: హలో మేము ఫలానా సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మేము రాండమ్‌గా కొన్ని మొబైల్ నెంబర్లను లాటరీ తీశాం. లక్కీగా మీరు ఎంపికయ్యారు. మీకు లక్షల్లో నగదు బహుమతి వస్తుంది. వెంటనే మీకు మేము పంపిన మెసేజ్‌లని ఈ కింది లింక్‌పై క్లిక్ చేసి మీకు వచ్చిన ఓటీపీ నెంబర్‌ను మాకు తెలియచేయండి. వెంటనే మీ ఖాతాకు లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చేస్తుందంటూ తియ్యగా మాట్లాడుతారు. ఓటీపీ చెప్పగానే తన ఖాతాకు డబ్బులు జమకావాల్సిందిపోయి ఖాతా ఖాళీ అయిపోతుంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమైపోతుంది.
ఇది మరో కాల్… మీ కార్డు బ్లాక్ అయిపోయింది. ఓటీపీ చెప్పండంటూ ఫోన్ చేస్తారు. ఏటీయం కార్డు బ్లాక్ అయిందని కంగారుపడిపోయి వెంటనే వారి మాటలను నమ్మేసిన అమాకులను మాటల్లో పెట్టి ఒక మెసేజ్ పంపిస్తారు. మీకు ఓటిపి వచ్చింది. వెంటనే చెప్పండి. మీ కార్డు బ్లాక్ కాకుండా చేస్తాం అని నమ్మబలుకుతారు. ఓటిపి చెప్పగానే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో డబ్బు మాయం అయిపోతుంది. దీంతో తాము మోసపోయామని తెలుసుకుని తమకు వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
ఇలాంటి తరహాలోనే ప్రకాశంజిల్లా దోర్నాల మండలం అయినముక్కల గ్రామానికి చెందిన లింగాల రమేష్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ మెసేజ్ పంపించాడు. తనకు లక్షల రూపాయల బహుమతి వచ్చిందని మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఆ తరువాత ఓ నెంబర్ నుంచి అతనికి కాల్ వచ్చింది. రమేష్ ఆ కాల్‌ను అటెండ్ చేసి మట్లాడాడు. ఆ వ్యక్తి తీయనైన మాటలతో రమేష్‌ను బురిడీ కొట్టించాడు. తన నెంబర్‌కు ఓటిపి వచ్చిందని, ఆ ఓటిపి నెంబర్ చెబితే మీ ఖాతాలో నగదు జమ అవుతుందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన రమేష్ వెంటనే తనకు వచ్చిన ఓటిపి నెంబర్‌ను చెప్పేశాడు. ఇలా పలుమార్లు ఓటిపిలు పంపి రమేష్ ఖాతానుంచి 6 లక్షల 90 వేలు డ్రా చేశాడు. చివరకు ట్రాన్సాక్షన్ పూర్తయిందని ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. వెంటనే రమేష్ తన ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు.
ఆ ఖాతాలో 6 లక్షలా 90 వేల రూపాయలు విత్‌డ్రా అయినట్టు కనిపించింది. అంతే రమేష్ గుండెల్లో పెద్ద బండరాయి పడింది. తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోర్నాల ఎస్‌ఐ అంకమరావు బాధితుడు రమేష్ చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తు తరువాత రమేష్‌కు డబ్బులు తిరిగి వస్తాయా… అంటే ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారట. అంటే తనకు ఓటిపిలు పంపి ఉచ్చులో బిగించి తన అంగీకారంతోనే తన ఖాతాలో డబ్బులు కాజేశారన్నమాట. డబ్బులు పోతేపోయాయి అనుభవం వచ్చిదని సర్దుకుపోవాలో, కష్టపడి కూడబెట్టుకున్న లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ళ పాలైందని బాధపడాలో అర్ధంకాక రమేష్ కుమిలిపోతున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.