Chittoor: మదనపల్లెలో దారుణం.. పొట్టేలును బలి ఇవ్వబోయి యువకుడి తలను నరికాడు.. మద్యం మత్తులో..

Chittoor Madanapalle Incident: సంక్రాంతి పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొట్టెలును బలి ఇవ్వబోయి.. అక్కడున్న మరో వ్యక్తి

Chittoor: మదనపల్లెలో దారుణం.. పొట్టేలును బలి ఇవ్వబోయి యువకుడి తలను నరికాడు.. మద్యం మత్తులో..
Goat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 17, 2022 | 11:39 AM

Chittoor Madanapalle Incident: సంక్రాంతి పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొట్టెలును బలి ఇవ్వబోయి.. అక్కడున్న మరో వ్యక్తి తలను నరికాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెని వలసపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. దేవుడికి బలిచ్చే సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తల అనుకుని మనిషి తలను నరికాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కనుమ పండుగ నేపథ్యంలో ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇచ్చే సమయంలో పొట్టేలును పట్టుకుని ఉన్న తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్ (35) ను… పొట్టేలు నరికే వ్యక్తి చలపతి నరికేశాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు రక్తపు మడుగులో కుప్పకూలిన బాధితుడు సురేష్‌ను హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సురేష్, చలపతి ఇద్దరు వరుసకు అన్నదమ్ములని పేర్కొంటున్నారు. జాతరకు చందా ఇవ్వకుండగా హంగామా చేస్తున్న సురేష్ పై అందరి ముందే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్నదమ్ముల మద్య పాత కక్షలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని మదనపల్లి రూరల్ పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అనంతరం మృతుడిని మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

త్రినేత్రంతో ఆవు దూడ జననం.. శివుడి అంశగా భావిస్తున్న జనం.. ఎక్కడంటే..?

Viral News: ఈ విస్కీ బాటిల్ బాగా కాస్ట్లీ గురూ.. ఎంత ధర పలికిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్!