Cumbum Cheruvu: ఏడు కొండల చెరువుకు జలకళ.. నల్లమల అటవీ ప్రాంతం నుంచి పోటెత్తిన వరద..

Prakashan District News: కంభం చెరువుకు గత కొద్దిరోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది... దీంతో చెరువు జలకళ సంతరించుకుంది. నిండుకుండలా ఉన్న చెరువును సందర్శించేందుకు పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. నీటి నిలువలు అడుగంటుతున్న సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మళ్లీ చెరువులో నీటిమట్టం పెరగడంతో కంభం చెరువు పై ఆధారపడి పంటలు వేసే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Cumbum Cheruvu: ఏడు కొండల చెరువుకు జలకళ.. నల్లమల అటవీ ప్రాంతం నుంచి పోటెత్తిన వరద..
Cumbum Cheruvu
Follow us
Fairoz Baig

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 30, 2023 | 2:52 PM

ప్రకాశంజిల్లా, జూలై 30: ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువులలో రెండవదైన ప్రకాశంజిల్లాలోని కంభం చెరువుకు వరద నీరు పోటెత్తింది. కంభం చెరువుకు గత కొద్దిరోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది… దీంతో చెరువు జలకళ సంతరించుకుంది. నిండుకుండలా ఉన్న చెరువును సందర్శించేందుకు పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. నీటి నిలువలు అడుగంటుతున్న సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మళ్లీ చెరువులో నీటిమట్టం పెరగడంతో కంభం చెరువు పై ఆధారపడి పంటలు వేసే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంభం చెరువు ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లా కంభం లో ఉంది. ఈ చెరువును 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించారు. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.

కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల రైతులకు నీరందిస్తుంది. ఇటీవల పూడిక కారణంగా అది 2 టీఎంసీలకే పరిమితం అయింది…

కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు…

ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువుగా ఉన్న కంభం చెరువుని ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే (ఐసీఐడీ) సంస్థ అధికారికంగా ప్రకటించింది. చెరువు అన్న పేరే కాని ఇది ఓ పెద్ద ఆనకట్టలా ఉంటుంది… కంభం చుట్టుపక్కల మెట్ట ప్రాంతరైతులకు ఈ చెరువు నీరే ప్రధాన వనరు… చెరువు పూర్తి నీటి సామర్థ్యంతో ఉంటే చుట్టు పక్కల కంభం, బెస్తవారి పేట, అర్థవీడు మండలాల్లో అధికారికంగా 19 గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. 2 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

భర్తతో విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ లేడీ అసిస్టెంట్
భర్తతో విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ లేడీ అసిస్టెంట్
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
విజయవాడ యూత్‌కి గుడ్‌న్యూస్‌.. ఇకపై వీకెండ్‌ ధూంధామ్‌!
విజయవాడ యూత్‌కి గుడ్‌న్యూస్‌.. ఇకపై వీకెండ్‌ ధూంధామ్‌!
ఏపీకి మరో వర్ష గండం.. అమ్మబాబోయ్.! ఈ ప్రాంతాల్లో..
ఏపీకి మరో వర్ష గండం.. అమ్మబాబోయ్.! ఈ ప్రాంతాల్లో..
ద్యావుడా ఎటు పోతున్నాం.. నడి రోడ్డుమీదనే బట్టలు మార్చుకున్న యువతి
ద్యావుడా ఎటు పోతున్నాం.. నడి రోడ్డుమీదనే బట్టలు మార్చుకున్న యువతి
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
CBSE 10,12తరగతులకు ఓపెన్ బుక్ పరీక్ష విధానం.. బోర్డు క్లారిటీ ఇదే
CBSE 10,12తరగతులకు ఓపెన్ బుక్ పరీక్ష విధానం.. బోర్డు క్లారిటీ ఇదే
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
ఆ కంపెనీ షేర్లు కొంటే నష్టమా..? ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు ఇవే
ఆ కంపెనీ షేర్లు కొంటే నష్టమా..? ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు ఇవే
శరీరానికి నువ్వుల పట్టించి స్నానం చేస్తే జరిగేది ఇదే..
శరీరానికి నువ్వుల పట్టించి స్నానం చేస్తే జరిగేది ఇదే..