Nandyala: కొబ్బరి బోండాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. ఆ తర్వాత సీన్ మీరే చూడండి..
నిమిషాల వ్యవధిలో లోడ్ ఖాళీ అయ్యింది. అవును.. అరెర్ లారీ కింద పడిందే.. పాపం దాంట్లో ఉన్నవారికి ఏమైనా దెబ్బలు తగిలాయా ఏంటి అని కూడా ఎవరూ పట్టించుకోలేదు.. దొరికినకాడికి.. కొబ్బరి బోండాలు ఎత్తుకుపోయారు. విజువల్స్ చూద్దాం పదండి....

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న లారీ డోన్ మండలం జగదుర్తి స్టేజి వద్దకు రాగానే అదుపుతప్పి లారీ బోల్తా కొట్టింది. గుత్తినుంచి హైదరాబాద్‌తో కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న లారీ ముందు భాగంలోని టైరు పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. దాంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయింది లారీ. లారీ బోల్తా పడి కొబ్బరిబొండాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న నేషనల్ హైవే అథారిటీవారు జేసీబీ సహాయంతో లారీని పక్కకు తొలగించారు.
సందట్లో సడేమియా అన్నట్టు స్థానికులు డ్రైవర్ పరిస్థితి గానీ, లారీలో ఇంకెవరైనా ఉన్నారా, ఎవరికైనా ప్రమాదం జరిగిందా అనేది పక్కన పెట్టి, ఎవరికి దొరికిన కొబ్బరి బొండాలు వారు తీసుకొని వెళ్లారు. కొందరు ఏకంగా సంచుల్లో కొబ్బరికాయలు నింపుకొని వెళ్లారు. ఇప్పుడు మాత్రమే కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. కోళ్లు, మేక కాళ్లు, లిక్కర్ బాటిల్స్, మిల్క్ తరలిస్తున్న వ్యాన్లు, లారీలు ప్రమాదాలకు గురైనప్పుడు.. వాటి కోసం స్థానికులు ఎగబడిన ఘటనలు కోకొల్లలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
