Andhra Pradesh: ఏపీలో సరికొత్త కార్యక్రమం.. ఇంటింటికి జగన్ స్టిక్కర్ అంటించే ప్రొగాం ఎప్పటినుంచి అంటే..

|

Feb 08, 2023 | 6:32 AM

కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది వైసీపీ. ఇంటింటికి జగన్ స్టిక్కర్ అంటించే ప్రొగాంను ఈనెల 11న గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు వాలంటీర్లు, గృహసారధులు.

Andhra Pradesh: ఏపీలో సరికొత్త కార్యక్రమం.. ఇంటింటికి జగన్ స్టిక్కర్ అంటించే ప్రొగాం ఎప్పటినుంచి అంటే..
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తూ.. తనదైన పాలనతో ముందుకుసాగుతున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గడప గడప కు అంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అవును ఏపీలో అధికార వైసీపీ పార్టీ కొత్త కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ వాలంటీర్లు, ఏరియా గృహ సారథులు వెళ్లి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలపై వివరాలు తెలుసుకోబోతున్నారు. సర్వే తర్వాత ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని రాసి ఉన్న స్టిక్కర్‌ను ఆ ఇంటికి అంటిస్తారు. ఆ స్టిక్కర్ పై సీఎం జగన్ బొమ్మతో పాటు మా నమ్మకం నువ్వే జగన్ అనే లెటర్స్ ఉన్నాయి. అయితే, స్టిక్కర్ అంటించేముందు ఇంటి యజమాని నిర్ణయం తీసుకుంటారు. ఇంటి యజమాని అంగీకరిస్తేనే స్టిక్కర్ ను అతికించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గృహ సారధులు, వాలంటీర్లు సమన్వయం చేసుకొని ఇళ్ల గుర్తింపు చేపడతారు. ఈ కార్యక్రమం వేగవంతంగా జరిపేందుకు కొత్తగా ప్రతి 50 ఇళ్లకు వేగంగా గృహసారధులను నియమించింది వైసీపీ. ఈ కొత్త ప్రొగ్రాంలో గృహ సారథులు కీలకపాత్ర పోషించనున్నారు. స్టిక్కర్ అంటిండం ద్వారా అధికార వైసీపీ ఓ అంచనాకు రాబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలోని ఓటర్ల నాడీ ఈ ప్రొగ్రాంతో వైసీపీ తెలుసుకోబోతుందని రాజీకీయ విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే ‘జగనన్నకు చెబుదాం’ అనే మరో కార్యక్రమానికి కూడా అధికారపక్షం రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగనన్నకు చెబుదాం అనే ప్రొగ్రాం ఏప్రిల్ లో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది వైసీపీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..