అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించింది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ యాత్రకు జిల్లా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వైసీపీ. ఇందులో భాగంగా మేమంతా సిద్ధం సభతో జగన్ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన పథకాల గురించి చెప్పడమే కాకుండా గతంలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. 4వరోజు మేమంతా సిద్ధం సభలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు.
ఉదయం పత్తికొండ నుంచి ప్రారంభమైన యాత్ర గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లి మీదుగా అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అయింది. గుత్తిలో జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. సీఎం జగన్ ను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్గం మధ్యలో అక్కడక్కడా బస్సును నిలుపుతూ అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. తమ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ రోడ్ షో అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది. సభ అనంతరం రాత్రికి ధర్మవరం నియోజకవర్గం చేరుకొని సంజీవపురంలో బస చేస్తారు సీఎం జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…