తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుబంటి సంచారం
తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల సంచారం కొనసాగుతోంది. మెట్లమార్గంలో గతేడాది కౌశిక్, లక్షితలపై దాడి జరిగిన ప్రాంతంలోనే వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. తాజాగా బుధవారం రాత్రి 7వ మైలు వద్ద చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అంతేకాదు అక్కడ ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు అటవీశాఖ సిబ్బంది సైతం చెబుతోంది. చిరుత సంచారాన్ని గుర్తించిన అటవీశాఖ, టీటీడీ అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల సంచారం కొనసాగుతోంది. మెట్లమార్గంలో గతేడాది కౌశిక్, లక్షితలపై దాడి జరిగిన ప్రాంతంలోనే వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. తాజాగా బుధవారం రాత్రి 7వ మైలు వద్ద చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అంతేకాదు అక్కడ ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు అటవీశాఖ సిబ్బంది సైతం చెబుతోంది. చిరుత సంచారాన్ని గుర్తించిన అటవీశాఖ, టీటీడీ అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వారం రోజుల క్రితం నడక మార్గంలోని NS టెంపుల్ వద్ద ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది చిరుత సంచారాన్ని కూడా ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్న అటవీ శాఖ వన్యప్రాణుల కదిలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. వాటి కదలికల ఆధారంగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందు తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే ??
లేగదూడకు బారసాల.. 500 మందికి విందు భోజనం
అర్ధరాత్రి ఫోన్ చేసి రూ.5 లక్షలు అడిగిన మనోజ్.. రామ్‌చరణ్ రియాక్షన్ ఇదే
10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు