Andhra Pradesh: ఆ కుటుంబాలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నియామకాలపై త్వరలోనే ఉత్తర్వులు..!

Andhra Pradesh: కోవిడ్ కారణంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. కరోనాతో బాధపడుతున్న కష్టకాలంలో కూడా సామాన్యులకు సేవలిందిస్తూ మరణించిన ఉద్యోగుల..

Andhra Pradesh: ఆ కుటుంబాలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నియామకాలపై త్వరలోనే ఉత్తర్వులు..!
CM Jagan

Updated on: Jun 27, 2023 | 9:30 PM

Andhra Pradesh: కోవిడ్ కారణంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. కరోనాతో బాధపడుతున్న కష్టకాలంలో కూడా సామాన్యులకు సేవలిందిస్తూ మరణించిన ఉద్యోగుల బలిదానాన్ని గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు కారుణ్య మరణాలకు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కోవిడ్ కారణంతో చనిపోయిన వారి కుటుంబాల నుంచి ఆయా ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఖాళీలు, పాయింట్లు, రోస్టర్లతో ఎటుంవంటి సంబంధం లేకుండా ఈ నియామకాలను చేపట్టాలని తీర్మానించింది.

ఈ మేరకు ఖాళీ ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని సీఎం జగన్ ఆధికారులను అదేశించడంతో.. ప్రభుత్వం కూడా ఉత్తర్వులను త్వరలోనే జారీ చేసేందుకు సిద్ధమైంది. అయితే గతంలోనే ఓ సమీక్షా కార్యక్రమంలో సీఎం జగన్ కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల గురించి ప్రస్తావించారు. కుటుంబానికి మూలస్థంభమైన వ్యక్తి చనిపోవడంతో కష్టాలపాలైన కుటుంబాల పట్ల వ్యవహరించాలని, ఆయా కుటుంబాల నుంచి ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..