CM Jagan: ఆడుదాం ఆంధ్రపై ఉన్నతస్థాయి సమీక్ష.. ఈ ఆటలను ప్రమోట్ చేయాలన్న సీఎం జగన్..

|

Dec 20, 2023 | 10:25 PM

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబరు 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు.

CM Jagan: ఆడుదాం ఆంధ్రపై ఉన్నతస్థాయి సమీక్ష.. ఈ ఆటలను ప్రమోట్ చేయాలన్న సీఎం జగన్..
Cm Jagan
Follow us on

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబరు 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు. దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం ఏపీలో జరగలేదన్న సీఎం జగన్‌.. అలాంటి కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ప్రివెంటివ్‌ కేర్‌ ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే వ్యాయామం అత్యంత అవసరమన్నారు. అందుకే గ్రామస్థాయిలో వ్యాయామం, క్రీడలు ఈ రెండింటిని ప్రమోట్‌ చేయడం అన్నది ఒక ప్రధాన కారణమన్నారు.

రెండోది గ్రామస్థాయిలో మన దగ్గరున్న క్రీడా ప్రతిభను, మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారికి సరైన గుర్తింపు ఇవ్వగలిగితే మరింతమంది ప్రతిభావంతులు బయటపడతారు. గ్రామస్థాయి నుంచి పెద్ద సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం పిల్లలకు వస్తుందన్నారు సీఎం జగన్‌. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా…క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో లను ప్రమోట్‌ చేయాలన్నారు సీఎం. గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడంతో పాటు ఐడెంటిపై చేసిన ప్రతిభగల క్రీడాకారులను తిరిగి ప్రోత్సహించేలా అడుగులు పడాలని అధికారులకు సూచించారు జగన్‌. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు సీఎం. గ్రామ స్థాయి నుంచి వ్యాయామం, క్రీడలను ప్రమోట్‌ చేయాలన్నారు జగన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..