AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి.. కారణం ఇదే!

ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలే ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తూ గ్యాస్‌ లీక్ అయ్యి మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ (22) నగరంలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్‌ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని..

Vijayawada: అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి.. కారణం ఇదే!
Medical Student Died In Chicago
Srilakshmi C
|

Updated on: Dec 21, 2023 | 7:42 AM

Share

విజయవాడ, డిసెంబర్‌ 21: ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలే ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తూ గ్యాస్‌ లీక్ అయ్యి మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ (22) నగరంలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్‌ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని షికాగోకు వెళ్లారు. అయితే ఆమె బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో కారు డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్‌ స్పృహ తప్పారు. గమనించిన కొందరు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ విషయాన్ని అక్కడి జహీరా నాజ్ స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జహీరా నాజ్ మరణంతో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లిన తమ కూతురు అర్ధాంతరంగా ఇలా చనిపోతుందని ఊహించలేకపోయామంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జహీరా నాజ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రసాదంపాడులో విషాద చాయలు అలముకున్నాయి. విద్యార్థిని మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఫోన్ స్క్రీన్ కాదది.. మెదడును మెల్లగా తినేసే డిజిటల్ డ్రగ్!
ఫోన్ స్క్రీన్ కాదది.. మెదడును మెల్లగా తినేసే డిజిటల్ డ్రగ్!
తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
తులసి మొక్క ఎందుకు ఎండిపోతుంది..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..
ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..
పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!
పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రాపై బిగ్ అప్డేట్..
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైసే చేస్తే ప్లేటు ఖాళీ
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
పుచ్చకాయలోని ఈ పార్ట్ తింటే జెట్ స్పీడ్ తో బరువు తగ్గుతారట!
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు