CM Jagan: గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్‌.. కిడ్నీ బాధితుడికి గంటల వ్యవధిలోనే..

|

May 23, 2023 | 8:47 PM

ఏపీ సీఎం జగన్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనారోగ్య సమస్యలతో తన దగ్గకు వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం అందించారు. తద్వారా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.

CM Jagan: గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్‌.. కిడ్నీ బాధితుడికి గంటల వ్యవధిలోనే..
Cm Jagan
Follow us on

ఏపీ సీఎం జగన్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనారోగ్య సమస్యలతో తన దగ్గకు వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం అందించారు. తద్వారా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం సీఎం జగన్‌ బందరు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుగు ప్రయాణంలో భాగంగా స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ దగ్గరకు గోపాల నాగ వెంకట చంద్రబాబు అనే వ్యక్తి వచ్చాడు. మచిలీపట్నం 34 వ డివిజన్ వర్రె గూడెంకు చెందిన ఆయన వీపు వెనక ఒక పెద్ద క్యాన్సర్‌ కణితి వచ్చింది. చికిత్సలో భాగంగా పాడైపోయిన అతని కిడ్నీని వైద్యులు తొలగించారు. దాదాపు చావు అంచుల దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చిన ఆయన గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈక్రమంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని, వైద్య చికిత్సకు సాయం చేయాలని సీఎం జగన్‌ దగ్గరకు వచ్చి అభ్యర్థించారు. బాధితుడి పరిస్థితి చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి అర్జీని, మెడికల్ రిపోర్ట్స్‌ను చదివి వెంటనే రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి తక్షణమే డబ్బులు అందేలా కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబును సీఎం జగన్‌ ఆదేశించారు

ఈక్రమంలో మంగళవారం ఉదయమే గోపాల్‌కు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయంఅందజేశారు. జిల్లా కలెక్టర్‌ రాజబాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్నినాని చేతుల మీదుగా బాధితునికి చెక్కును అందజేశారు. ‘ ఆదుకోండని అడిగిన గంటల వ్యవధిలోనే సహాయం అందినందుకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. సీఎం జగన్‌ చేసిన ఈ మేలు నేను ఎప్పటికీ మరవను’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు వెంకట చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..