సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు పర్యటన ఖరారు.. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 25న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 25న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. కాగా, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. సీఎం జగన్ పర్యటన ఖరారు కావడంతో ఏర్పేడు సమీపంలోని చిందేపల్లిని అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా, దేశ చరిత్రలో ఒకేసారి 30.66 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసు వేయించి స్టేలు తెచ్చి 3,65,680 ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకున్నారు. దీంతో ఈనెల 25న 27 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారు. 11 వేలకుపైగా పంచాయతీల్లో 17,436 వైఎస్సార్ జగనన్న కాలనీలు కనిపించనున్నాయి.