వాడరేవులో మళ్లీ రచ్చ.. పోలీసులపై రాళ్లు రువ్విన మత్స్యకారులు.. బాధితులకు తగిన న్యాయం చేస్తానని మోపిదేవి హామీ.!

ప్రకాశం జిల్లా వాడరేవులో మళ్లీ రచ్చ మొదలైంది. ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెంట వచ్చిన పోలీసులపై మత్స్యకారులు రాళ్ల దాడి చేశారు.

వాడరేవులో మళ్లీ రచ్చ.. పోలీసులపై రాళ్లు రువ్విన మత్స్యకారులు.. బాధితులకు తగిన న్యాయం చేస్తానని మోపిదేవి హామీ.!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 14, 2020 | 1:28 PM

Mopidevi Venkataramana Tour: ప్రకాశం జిల్లా వాడరేవులో మళ్లీ రచ్చ మొదలైంది. ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెంట వచ్చిన పోలీసులపై మత్స్యకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆమంచికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మత్స్యకారులు రచ్చ చేశారు. అక్కడ పరిస్థితి ఉదృత్తంగా మారడంతో పోలీసులు అదుపు చేసే యత్నం చేయగా.. మత్స్యకారులు రాళ్లు రువ్వక ముందే మోపిదేవి బృందం అక్కడ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు. కాగా, అంతకముందు కఠారివారిపాలెం మత్స్యకారుల దాడిలో గాయపడ్డ వారిని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరామర్శించారు. మోపిదేవి వెంట చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు ఉన్నారు.

ఈ సందర్భంగా మోపిదేవికి వాడరేవు మత్స్యకారులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆమంచి సమక్షంలోనే కఠారిపాలెం మత్స్యకారులు మాపై దాడి చేశారని మోపిదేవికి ఫిర్యాదు చేశారు. అయితే తాను ఘర్షణలను నివారించేందుకు వచ్చానని తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆమంచి వాడరేవు మత్స్యకారులకు సర్దిచెప్పారు. తొలుత చీరాల పట్టణంలోని ఐకాన్ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వాడరేవు మత్యకారులను మోపిదేవి వెంకటరమణ పరామర్శించారు.

మోపిదేవితో పాటు ఎమ్మేల్యే కరణం బలరాం ,మాజీ ఎమ్మెల్యే ఆమంచి, కరణం వెంకటేష్‌లు ఉన్నారు. ఆమంచి, కరణం వర్గీయులను హస్పిటల్ లోపలికి పోలీసులు అనుమంతిలేదు… దీనితో హాస్పిటల్‌ బయటకు వచ్చిన మోపిదేవి, కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్‌ల ఎదుటే ఇరువర్గాల కార్యకర్తలు వాగ్వవాదానికి దిగారు. వారిని మోపిదేవి వారించారు. ఇక అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది…అనంతరం వాడరేవులో పర్యటించి దాడికి గురైన మత్స్యకారులను మోపిదేవి పరామర్శించారు. ధ్వంసమైన ఆస్థులను పరిశీలించారు. ఎవరై అధైర్యపడవద్దని, తగిన విధంగా న్యాయం చేస్తామని బాధితులకు మోపిదేవి హామీ ఇచ్చారు.