కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. ఏంటంటే..

| Edited By: Srikar T

Apr 01, 2024 | 10:10 AM

కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్‎కి బహిరంగ సభలోనే జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించడం పట్ల చర్చనీయాంశంగా మారింది. జగన్ చాలా వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు.

కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. ఏంటంటే..
Cm Jagan Meeting
Follow us on

కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్‎కి బహిరంగ సభలోనే జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించడం పట్ల చర్చనీయాంశంగా మారింది. జగన్ చాలా వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. మార్చి 29న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో.. టికెట్ దక్కని కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‎కి ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఉన్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. హఫీజ్ ఖాన్‎కి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగానే ఆయనకు టికెట్ దక్కలేదనేది బహిరంగ సత్యం. విఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ ఇంతియాజ్‎కి కర్నూలు అభ్యర్థిగా జగన్ అవకాశం ఇచ్చారు.

ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేను తప్పించి అదే సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇందులో పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఉన్నట్టుండి హఫీజ్ ఖాన్‎కి రాజ్య సభ ఆఫర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జనాభా అత్యధికంగా ఉన్నది ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆర్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో దాదాపు సగం ఓట్లు మైనార్టీలవే ఉన్నాయి. వీటితోపాటు సీమ జిల్లాలు, నెల్లూరు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కూడా ముస్లిం సామాజికవర్గపు ఓట్లు అధికంగా ఉన్నాయి. పైగా తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో ముస్లిం ఓట్లు వైసీపీకి ప్లస్ కావచ్చని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ముస్లిం కమ్యూనిటీకి చెందిన హఫీజ్ ఖాన్‎కి రాజ్యసభ ఇవ్వడం జగన్ వ్యూహంలో భాగమేనని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ ప్రకటనతో హఫీజ్ ఖాన్ వర్గం సంతోషంతో పొంగిపోతుండగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గంలో నిస్తేజం నెలకొంది. తమకు టికెట్ ఇవ్వకపోగా తమ ప్రత్యర్థికి బంపర్ ఆఫర్ ప్రకటించడం, బహిరంగంగా చెప్పడం పట్ల అసంతృప్తికి గురవుతున్నారు. మోహన్ రెడ్డికి కూడా వైసిపి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ తమ నేతకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ రెడ్డి వైఫ్ విజయ మనోహరికి జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చారు. జిల్లా అధ్యక్ష పదవితో రెండు వర్గాలకు న్యాయం చేసినట్లు అవుతుందని పార్టీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..