Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1600కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం
Ravi Kiran
|

Updated on: Jun 13, 2025 | 10:00 PM

Share

అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 49వ సమావేశం జరిగింది. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదించింది. దీని ద్వారా.. ఐకానిక్‌ టవర్స్‌, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు సంబంధించి బంగ్లాలు, నివాసాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ను నేషనల్‌ హైవేకు కలిపేందుకు 682 కోట్లతో టెండరు పిలవాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే టాప్‌-5 సిటీల్లో అమరావతి కూడా ఒకటి కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి నారాయణ.

దాంతోపాటు.. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని తెలిపారు. అమరావతిలోని 217 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ అండ్‌ బ్లూ సిటీ నందు 30 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ పర్యటనలో లక్నో లో రివర్ బండ్ ఎలా కట్టారు.. అక్కడ సాలిడ్ వేస్ట్ ప్లాంట్లు ఎలా ఉన్నాయనేది అధ్యయనం చేశామన్నారు. యూపీ అధికారులు కూడా ఇక్కడకు వచ్చి సాలిడ్ వేస్ట్ ప్లాంట్లపై అధ్యయనం చేయనున్నారని మంత్రి నారాయణ వివరించారు.

మొక్కజొన్న తొక్కలతో అందమైన పువ్వుల తయారీ.. వీడియో వైరల్
మొక్కజొన్న తొక్కలతో అందమైన పువ్వుల తయారీ.. వీడియో వైరల్
దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..