CM Chandrababu: నామినేటెడ్‌ పోస్టుల సెకండ్‌ లిస్ట్‌పై చంద్రబాబు క్లారిటీ

ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి చంద్రబాబు సర్కార్‌ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 99 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ ప్రకటించిన చంద్రబాబు... సెకండ్‌ లిస్ట్‌పై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెకండ్‌ బొనాంజాను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. మరి సెకండ్‌ లిస్ట్‌లో ఎంతమందికి పదవులు దక్కనున్నాయి...? మూడు పార్టీల షేర్‌ ఎంత...? మరోవైపు లెటెస్ట్‌గా నామినేటెడ్‌ పోస్టులపై చంద్రబాబు చేసిన కామెంట్స్‌ దేనికి సంకేతం...?

CM Chandrababu: నామినేటెడ్‌ పోస్టుల సెకండ్‌ లిస్ట్‌పై చంద్రబాబు క్లారిటీ
CM Chandrababu
Follow us

|

Updated on: Oct 19, 2024 | 1:30 PM

కూటమి నేతలు నామినేటెడ్‌ పదవుల కోసం గట్టిగానే శ్రమిస్తున్నారు. ఫస్ట్‌ లిస్ట్‌ వచ్చేసింది… సెకండ్‌ లిస్ట్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తొలివిడతలో 20 కార్పొరేషన్లకు.. చైర్మన్లు, సభ్యులను నియమిస్తూ 99 మందితో జాబితాను రిలీజ్‌ చేసిన చంద్రబాబు… సెకండ్‌ లిస్ట్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. జనసేన, బీజేపీ నేతలకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్న సంకేతాలిచ్చారు. అతి ఆశలు, అతిగా ఆవేదనలు వద్దంటూ టీడీపీ నేతలకు సూచించారు. పార్టీ కోసం పనిచేస్తే… ఫలితం ఎప్పటికైనా దక్కుతుందంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. టీడీపీ నేతల్లో టెన్షన్‌ పెరిగింది. త్యాగరాజులు, సీనియర్లలో ఆందోళన మొదలైంది.

ఇక ఫస్ట్‌ లిస్ట్‌లో 99 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే, ఈ పోస్టుల భర్తీలోనూ ఫాలో అయ్యారు. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని ఛైర్మన్లుగా, తొమ్మిది మందిని సభ్యులుగా, అలాగే బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు.

ఈ సెకండ్‌ లిస్ట్‌లో మహిళా నేతలకు భారీగా పదవులు దక్కే అవకాశం ఉంది. జనసేన, బీజేపీలకి ప్రాధాన్యతను ఇస్తూనే టీడీపీలో సీట్లు త్యాగం చేసిన వారు, అలాగే సీనియర్లకు కూడా న్యాయం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి మూడు పార్టీల షేరింగ్‌ రేషియో ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.

రెండో జాబితాలో టీటీడీ పాలక మండలి చైర్మన్‌తో పాటు బోర్డు మెంబర్స్‌ సహా పలు కీలక పదవులున్నాయి. మరీసారి అదృష్టం ఎవరిని వరించనుంది…? త్యాగరాజులకు ఫలాలు అందుతాయా…? అసలు ఎంతమందితో రెండో జాబితా రాబోంది…? అన్న ఉత్కంఠ నెలకొంది. మరి చూడాలి సెకండ్‌ బొనాంజా ఎప్పుడొస్తుందో…! ఎవరికి పదువులు కట్టబెడుతుందో…!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..