Andhra News: జ్వరం వచ్చిందని చిన్నారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన పేరెంట్స్.. డాక్టర్స్ చెప్పింది విని..
ఈ మధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని గుండెపోటు అనే మహమ్మారి కాటేస్తోంది. అప్పటిదాకా అందిరితో ఆనందంగా ఉన్న వారు క్షణాల్లో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో మనం చాలా చూశాం. తాజాగా కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ మధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని గుండెపోటు అనే మహమ్మారి కాటేస్తోంది. అప్పటిదాకా అందిరితో ఆనందంగా ఉన్న వారు క్షణాల్లో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవలే ఒక విద్యార్థిని స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతూ మరణించగా.. మరో చిన్నారి ఆడుకుంటూ అస్వస్థతకు గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటమే ఆమె మరణించింది తీవ్ర జ్వరం వల్ల కాదు.. గుండెపోటు వల్ల అని వైద్యులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లాలో పామర్రు మండలం పెదమద్దాలి గ్రామానికి చెందిన విద్యార్థిని గుమ్మడి లావణ్య స్థానికంగా ఉన్న స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. అయితే లావణ్యకు ఈనెల 5న జ్వరంతో రావడంతో తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. బాలికను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. అయినా జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేయడం స్టార్ చేశారు. కానీ ఈ క్రమంలో బాలిక సడెన్‌గా మరణించింది. దీంతో తీవ్ర జ్వరం కారణంగానే బాలిక మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు.
కానీ బాలికకు వైద్య పరీక్షలు పూర్తి చేసి వైద్యులు వారి కుటుంబ సభ్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. బాలిక మరణానికి తీవ్ర జ్వరం కారణం కాదని.. గుండెపోటే ప్రధాన కారణంగా తేల్చి చెప్పారు. ఈ వార్త విన్న లావణ్య తల్లిదండ్రులు గుండెపగిలేలా రోధించారు. అంత చిన్న వయస్సులో బాలిక గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
