మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..!
చిత్తూరు మేయర్ దంపతుల హత్యల కేసులో తుది తీర్పు వెల్లడైంది. పదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది. 2015 నవంబర్ 17న జరిగిన డబుల్ మర్డర్ కేసులో 23 మందిపై కేసు నమోదు అయ్యింది. పోలీసుల ఛార్జిషీట్ ఆధారంగా చిత్తూరు కోర్టు విచారణ జరిపింది. 122 సాక్షులను విచారించిన కోర్టు తుది తీర్పు వెలువరించింది.

చిత్తూరు మేయర్ దంపతుల హత్యల కేసులో తుది తీర్పు వెల్లడైంది. పదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది. 2015 నవంబర్ 17న జరిగిన డబుల్ మర్డర్ కేసులో 23 మందిపై కేసు నమోదు అయ్యింది. పోలీసుల ఛార్జిషీట్ ఆధారంగా చిత్తూరు కోర్టు విచారణ జరిపింది. 122 సాక్షులను విచారించిన కోర్టు 5 మందికి మరణశిక్ష విధించింది. అలాగే ప్రధాన నిందితుడికి రూ. 70 లక్షల జరిమానా అపరాధం విధించింది. తీర్పుపై అప్పీలుకు అవకాశం కల్పించిన కోర్టు.. హైకోర్టు ఆమోదం తర్వాత శిక్ష అమలు చేయనుంది.
చిత్తూరు 6వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పదేళ్ల క్రితం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో అప్పటి మేయర్ కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్‌ల హత్య కేసు పదేళ్లపాటు విచారించిన కోర్టు తుది తీర్పును వెల్లడించింది. 2015 నవంబర్ 17న జరిగిన హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా, శుక్రవారం (అక్టోబర్ 31) తీర్పు వెలువడింది. చిత్తూరులో ఉత్కంఠకు తెరతీసింది.
తెలుగు దేశం పార్టీకి చెందిన అప్పటి మేయర్ అనురాధ, కటారి మోహన్ దంపతుల దారుణ హత్య కేసులో 23 మంది నిందితులుగా పోలీసులు పేర్కొనగా, 122 మంది సాక్షులను కోర్టు విచారించింది. పదేళ్ల పాటు కొనసాగిన కోర్టు విచారణ ఈనెల 24న 5 మంది నిందితులపై నేర నిర్ధారణ చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించిన కోర్టు మూడుసార్లు తీర్పు వాయిదా వేసిన 6వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఎట్టకేలకు సంచలన తీర్పునిచ్చారు. నేరస్తుల మానసిక స్థితి, జైలులో వారి ప్రవర్తనపై ఆయా విభాగాల నుండి సీల్డ్ కవర్ రిపోర్ట్ తెప్పించుకున్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెలువరించారు.
ఇదిలావుంటే, ఉరిశిక్ష వద్దని హంతకుల తరపున న్యాయవాది విజయ్ చంద్ర రెడ్డి వాదనలు వినిపించారు. ప్రథమ పౌరురాలిని కార్యాలయంలో దారుణం హత్య చేసిన వారికి పెద్ద శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు తో కోర్టు సముదాయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా 5మంది హంతకులకు ఉరిశిక్ష విధించారు 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు. ఏ-1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, ఎం వెంకటేష్ లను హంతకులుగా తేల్చారు. ఏ1 చింటూ రూ 70 లక్షల అపరాధం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. రూ.70 లక్షల్లో రూ.50 లక్షలు మృతుల వారసులకు రూ 20 లక్షలు ఫిర్యాదుదారుడు సతీష్ నాయుడు కు చెల్లించాలని తీర్పునిచ్చారు.
కేసులో అబద్ధం సాక్ష్యం చెప్పిన వారిపై చర్యలకు కోర్టు ఆదేశించింది. మరోవైపు అప్పీలుకు కూడా అవకాశం కల్పించిన కోర్టు హైకోర్టు శిక్షను ఆమోదించే వరకు ఉరి నిలిపివేతకు ఆదేశించింది.ఇక తీర్పుపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ స్పందించింది. 5 మంది హంతకులకు కోర్టు మరణ శిక్ష విధించిందని పోలీసులు సకాలంలో సాక్షులను ప్రవేశ పెట్టగలిగారన్నారు. ప్రాసిక్యూషన్ టీం సమర్థవంతంగా పనిచేసిందన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ.
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు తీర్పుపై కటారి కుటుంబం స్పందించింది. 10 ఏళ్ళు న్యాయం కోసం పోరాటం చేసామన్నారు అనురాధ మోహన్ దంపతుల కోడలు కటారి హేమలత. న్యాయం గెలిచి తీర్పు వెలువడిందన్న కటారి హేమలత సహకరించిన ప్రాసిక్యూషన్, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. న్యాయం గెలిపించడం కోసం కోర్టులో పోరాటం చేశామని చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
