AP CM Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం పేరూరుకు పయనం అవుతారు. అక్కడ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం లో పాల్గొంటారు. అరగంటపాటు ఆలయంలో గడిపి వకుళమాత తొలి దర్శనం చేసుకోనున్నారు.
అలాగే ఉదయం 11:45 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇలాగనూరు చేరుకొని 700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న అపాచీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఇక మధ్యాహ్నం 12.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్.. ఎస్వీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను పరిశీలించనున్నారు. అనంతరం వికృతమాలలో ఏర్పాటైన 1700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన టీసీఏల్, అనుబంధ యూనిట్లుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి 2.40 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరుతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి