CM Jagan at Polavaram: ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లు పరిశీలించిన సీఎం జగన్.. పనుల పురోగతిని వివరించిన అధికారులు
Polavaram Project: తాడేపల్లి నుంచి ఈ ఉదయం పోలవరం ప్రాజెక్టు సైటుకు వచ్చిన సీఎం జగన్ పనులు జరుగుతున్న తీరు, పనుల పురోగతనిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్‌లో పర్యటించి మొత్తం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు
పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. తాడేపల్లి నుంచి ఈ ఉదయం పోలవరం ప్రాజెక్టు సైటుకు వచ్చిన సీఎం జగన్ పనులు జరుగుతున్న తీరు, పనుల పురోగతనిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్‌లో పర్యటించి మొత్తం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ చూశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను సీఎం జగన్ పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై సైట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం జగన్ సమీక్షించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను గత వారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఢిల్లీలో సమీక్షించారు. జూన్ 2024 లోపు పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రాజెక్టు అధికారులకు మంత్రి సూచించారు. అయితే ఆ లోపు సాధ్యం కాకపోవచ్చని ప్రాజెక్టు అథారిటీ అధికారులు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలియజేశారు. జూన్ 2025 నాటికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా ఓకే చెప్పింది కేంద్రం. అలాగే, ప్రాజెక్టుకు 2013–14 ధరలతో కాకుండా తాజా ధరల ఆధారంగా నిధులు చెల్లించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం