CM Jagan: రోడ్లు బాగున్నా దురుద్దేశంతో దుష్ప్రచారం.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ముఖ్యమంత్రి జగన్.. తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దురుద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు బాగున్నా.. కావాలనే...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ముఖ్యమంత్రి జగన్.. తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దురుద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు బాగున్నా.. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు సీఎం జగన్. సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుండేలా రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. వచ్చే జూన్, జులై నాటికి ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో పనులు చేపట్టాలని, అవి గడువు మేరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. కనీసం ఏడేళ్లైనా అవి పాడవ్వకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా నిర్వహణ కూడా సజావుగా, నాణ్యతతో సాగుతుందని అధికారులను ఆదేశించారు.
ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్ ప్రచారం తప్పట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. విష ప్రచారం చేస్తున్నాయి. అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి. ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి. పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఏపీసీఎం ఎంఎస్ యాప్‌ను ఉపయోగించాలి. ఈ యాప్ ద్వారా రోడ్ల గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏపీసీఎం ఎంఎస్ ద్వారా ఫిర్యాదు అందితే.. 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలి. ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. వెంటనే కంప్లైంట్ అందుకుని చర్యలు తీసుకుంటారు. నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు ఏ సమస్యలు రావు.
– వైఎస్.జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి




కాగా.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో… పాలన కూడా అలాగే ఉందని విమర్శించారు జనసేన లీడర్ నాగబాబు. అనంతపురంలో పర్యటించిన ఆయన.. నగరంలోని చెరువుకట్ట రోడ్డును పరిశీలించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టి వేయించి, పూడ్పించారు. తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందకెళ్తామని, ఎలాంటి బెదిరింపులకైనా భయపడేది లేదని స్పష్టం చేశారు నాగబాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..