విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ దాడి జరగడంతో రాబోయే రోజుల్లో ఆయన భద్రత విషయంలో పలు కీలక మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిఘా విభాగం కీలక సూచనలు చేసినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం గుత్తిలో జగన్ కాన్వాయ్‌పై కొందరు చెప్పులు విసిరారు. ఇప్పుడు జగన్‌పై రాయి విసరడం.. ఈ ఘటనలో ఆయన గాయపడటం కలకలం రేపింది. దీంతో నిఘా విభాగం హైఅలర్ట్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచార సమయంలో సీఎం జగన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేసింది.
సీఎం జగన్ పాల్గొనే సభల్లో ర్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తోంది. సభల్లో ప్రసంగించడానికి ముందు.. కొన్నిసార్లు ప్రసంగం ముగిసిన తరువాత సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు దగ్గరకు వెళుతున్నారు. అయితే తాజా పరిణామాలతో సభల్లో ర్యాంప్ వాక్ చేయొద్దని నిఘా విభాగం సూచనలు చేసింది. అంతేకాదు ఇకపై సీఎం జగన్ యాత్ర చేపట్టే బస్సు పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. జగన్‌కు, జనానికి మధ్య బారికేడ్లు ఉండాలని భద్రతా సిబ్బందికి నిఘా వర్గాలు సూచించాయి. క్రేన్లు, ఆర్చ్‌లు, భారీ గజమాలలు తగ్గించాలని.. వీలైనంత వరకు బస్సులోనే ఉంటూ రోడ్ షోలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్ధం విధించాలని నిఘా విభాగం సూచించినట్టు తెలుస్తోంది. అవసరమైతేనే జగన్ బస్సుకు దగ్గరగా నేతలు, కార్యకర్తలను అనుమతించాలని చెప్పింది. ఇకపై జగన్ పర్యటనలు, రోడ్ షోలు, పాల్గొనే సభల్లో భద్రతా వైఫల్యాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించింది.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర రెండు వారాలపాటు సాగింది. ఇందులో భాగంగా ఆయన ప్రజలను నేరుగా కలుస్తున్నారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు దగ్గరగా వెళుతున్నారు. తాజాగా ఆయనపై దాడి ఘటనతో పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర రెండు వారాలపాటు సాగింది. ఇందులో భాగంగా ఆయన ప్రజలను నేరుగా కలుస్తున్నారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు దగ్గరగా వెళుతున్నారు. తాజాగా ఆయనపై దాడి ఘటనతో పరిస్థితులు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..