కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ..

|

Mar 29, 2024 | 2:17 PM

ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయ ప్రచార యాత్రలు జోరందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజ బనగానపల్లె‎లో ప్రజా గళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఎన్డీయేతో జట్టుకట్టామన్నారు.

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ..
Chandra Babu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయ ప్రచార యాత్రలు జోరందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజ బనగానపల్లె‎లో ప్రజా గళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఎన్డీయేతో జట్టుకట్టామన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడే ఎమ్మార్పీఎస్ కూడా కలిసింది తమతో కలిసిందని పేర్కొన్నారు. క్రీస్తుశకం ఎలాగో తెలుగుదేశం శకం కూడా అలాగే అంటూ టీడీపీ 42 ఏళ్లు పూర్తిచేసుకుందని పార్టీ ప్రస్థానాన్ని వివరించారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే తన సంకల్పంగా చెప్పారు చంద్రబాబు. సంపద సృష్టించి పేదలకు పంచాలన్నదే తన లక్ష్యమన్నారు.

విద్యుత్ సంస్కరణలు, టెక్నాలజి టీడీపీ చలువే అని కొనియాడారారు. గోదావరి జలాలు రాయలసీమకు తెచ్చి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్నదే తమ పార్టీ లక్ష్యం అన్నారు. ఈ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందని విమర్శిచారు. పేదలకు అండగా ఉంటాం, వారికోసమే పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే తెలుగు జాతికి గుర్తింపురావాలని తెలిపారు. టీడీపీ ఏమి చేసిందన్న జగన్ ప్రశ్నకు సమాధానమిస్తా అయితే జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారో మీరు చెబుతారా అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. సీఎం ఇచ్చేది పది రూపాయలు అయితే దోచేది 100 రూపాయలు అని ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది. దీనికి కారణం ఇసుక కృత్రిమ కొరత అని తెలిపారు.

వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి తాను వచ్చానన్నారు. అయితే జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు మీరు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు. జగన్ సభలకు కూలి ఇచ్చి ప్రజలను తీసుకువెళ్లారని ఆరోపించారు. ప్రజాలను ఆదుకోవడం నా మార్కు అయితే.. జనాలను మోసం చేయడం జగన్ మార్కు అంటూ తీవ్రంగా విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేయనని, ద్రోహం చేస్తే వదిలిపెట్టనని హెచ్చరించారు. చదువుకున్న వాలంటీర్లకు స్కిల్ డెవలప్‎మెంట్ చేసి రూ.50 వేలు జీతం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ, జనసేన, టీడీపీల కలయిక భావితరాల కోసం అని వివరించారు. ఎన్డీయేలో ముస్లిం సోదరులకు అన్యాయం జరగదు.. గతంలో రెండు సార్లు ఎన్డీయేలో ఉన్నపుడు ముస్లింలకు అన్యాయం జరిగిందా అని అడిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…