Chandrababu: మీ ఆరోగ్యానికి రహస్యం ఏంటి..?.. స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఫన్నీ ఆన్సర్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏలూరు పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన పలు ఇంట్రెస్టింగ్...

Chandrababu: మీ ఆరోగ్యానికి రహస్యం ఏంటి..?.. స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఫన్నీ ఆన్సర్..
Chandrababu
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 01, 2022 | 12:28 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏలూరు పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు.. మన మైండ్‌ను నియంత్రిస్తూ ఇష్టపడి పని చేయాలని, ఏం తినాలో? ఎంత తినాలో? జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి, సాగులో ఏది ముఖ్యమని అడగగా.. నాలెడ్జ్ ఎకానమీ అన్నింటి కంటే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. వ్యవసాయం లేకుంటే ఆహారం, పరిశ్రమలు లేకుంటే వస్తువులూ ఉండవన్న చంద్రబాబు.. రెండు రంగాలను నాలెడ్జ్ ఎకానమీతో అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ప్రజలను మోసం చేసి జగన్‌ అధికారంలోకి వచ్చారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి చేయాల్సిన వారు విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల పరిస్థితిపై విద్యార్థులు ఆలోచించాలని కోరారు.

ఇప్పుడైనా ప్రజలంతా కళ్లు తెరవాలి. మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశా. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఎమ్మెల్యే పదవితో పనిలేదు. ప్రజల్లో చైతన్యం రావాలి. వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే ఏపీ బాగుపడుతుంది. ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌.. ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టారు. ప్రజలు ఇప్పుడైనా తన మాట వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుంది.

ఇవి కూడా చదవండి

– చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత..

కాగా.. గతంలోనూ చంద్రబాబు విద్యార్థులతో ఫన్నీ కాన్వర్జేషన్ నిర్వహించారు. తాను ఏ పని చేసినా దాన్ని ఆస్వాదిస్తానని, అందుకే తనకు అలసట రాదని చెప్పారు. నవ్యాంధ్ర కోసం ఇంతగా కష్టపడుతున్న మీకు అలసట రాదా? మీ చురుకుదనానికి, అలసటలేమికి రహస్యమేంటని విద్యార్థిని అడిగింది. దీనికి బదులుగా చేసే పనిని ఆస్వాదించడమే రహస్యమని, విద్యార్థులు కూడా చదువును ఆస్వాదిస్తే ఆ రహస్యమేంటో బోధపడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..