AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Brahmani: వావ్‌.. నారా బ్రాహ్మణిలో ఈ కోణం కూడా ఉందా.! కొండల్లో బైక్‌పై రయ్యి రయ్యిమంటూ..

నందమూరి బాలకృష్ణ కూతురు, నారా లోకేశ్‌ భార్య... ఇది మాత్రమే తన ఐడెంటింటి కాదని నిరూపించుకుంటున్నారు నారా బ్రాహ్మణి. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన బ్రాహ్మణి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓవైపు తల్లిగా తన బాధ్యతను..

Nara Brahmani: వావ్‌.. నారా బ్రాహ్మణిలో ఈ కోణం కూడా ఉందా.! కొండల్లో బైక్‌పై రయ్యి రయ్యిమంటూ..
Nara Brahmani
Narender Vaitla
|

Updated on: Dec 01, 2022 | 7:50 AM

Share

నందమూరి బాలకృష్ణ కూతురు, నారా లోకేశ్‌ భార్య… ఇది మాత్రమే తన ఐడెంటింటి కాదని నిరూపించుకుంటున్నారు నారా బ్రాహ్మణి. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన బ్రాహ్మణి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓవైపు తల్లిగా తన బాధ్యతను నిర్వరిస్తూనే మరోవైపు హెరిటెజ్ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు బ్రాహ్మణి.

నారా బ్రాహ్మణికి బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. ఆమె ఒక ప్రొఫెషినల్‌ బైక్‌ రైడింగ్‌ గ్రూపులో మెంబర్‌ కూడా. ఇటీవల..జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లడక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు. ఈ ట్రావెల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్పోర్ట్స్‌ బైక్‌ను అలవోకగా కొండల్లో నడపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బ్రాహ్మణిలో ఇలాంటి టాలెంట్‌ కూడా ఉందా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల లడఖ్‌లోని లేహ్‌ ప్రాంతాన్ని సందర్శించిన నారా బ్రాహ్మణి అక్కడ అడ్వెంచరస్‌ బైక్‌ రైడ్‌లో పాల్గొన్నారు. కొండల నడుమ సాగే ఈ జర్నీలో పలువురు బైక్‌ రైడర్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జర్మీకి సంబంధించిన వివరాలను వీడియో రూపంలో పంచుకున్నారు బ్రాహ్మణి. ఉదయంపూట లేహ్‌ నుంచి బైక్ రైడింగ్ చేస్తూ బయల్దేరి, థిక్సే మాంటెన్సరికీ చేరిన తర్వాత అక్కడే టిఫిన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. బ్రాహ్మణి జర్నీ, బైక్‌ రైడింగ్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..