AP Caste Census: 92 ఏళ్ల తర్వాత కులాల వారీ లెక్కలు తేల్చే పనిలో సర్కార్.. అక్టోబర్ 20 తర్వాత సర్వే షురూ..!
ఏపీలోనూ పొలిటికల్ హీట్ అందుకు ధీటుగా మాంచి వేడిమీద సాగుతోంది. రానున్న ఎన్నికల కోసం రాజకీయ వ్యూహం రెడీ అవుతోంది. ఎవరి లెక్కలు వాళ్లవే.. మొత్తానికి కీలక సమయంలో ఏపీ కేబినెట్ భేటీ కీలకంగా మారింది. ఏపీలో కులగణనకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

రాష్ట్రంలో ప్రజలందరినీ ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ది చేయాలనేదే లక్ష్యం అంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇంద కోసం కులాల వారీ లెక్కలు తీయడం ఒక్కటే మార్గం అంటుంది. అందుకే సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతుంది సర్కార్. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమం అందిస్తున్న రాష్ట్రంగా చెబుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, కులాల వారీ లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. ఇప్పటికే కులగణన కోసం గత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఇతర రాష్ట్రల్లో కులగణన ఏవిధంగా జరిగిందో అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీని కూడా నియమించింది. ఇప్పటికే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. కమిటీ నివేదిక ఆధారంగా కులగణన ఏ రకంగా చేపట్టాలనే దానిపై సర్కార్ విధివిధానాలు సిద్దం చేస్తుంది.
92 ఏళ్ల తర్వాత కులాల వారీ లెక్కలు తీస్తున్న సర్కార్
దేశంలో చివరిసారిగా 1931లో సమగ్ర కులగణన చేపట్టారు. అప్పటి నుంచి ఉన్న లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, కులాల వారీగా ఉన్న జనాభాను గానీ అంచనా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో అట్టడుగు, బలహీన వర్గాలకు పథకాలు మెరుగ్గా అందడం లేదనేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన. అప్పటి నుంచి సమగ్రమైన లెక్క లేదని చెబుతుంది. అందుకే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా అణగారిన వర్గాలకు మరింత భద్రత కల్పించవచ్చంటుంది. కులాల వారీ లెక్కలు తేలితే, ఏ కులం ప్రజలు ఇంకా ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారు, వారిని ఏ రకంగా అభివృద్ది చేయాలనేది స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెబుతుంది.
ఈ నేపథ్యంలోనే ఈనెల 20 తర్వాత నుంచి కులగణన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనుంది ప్రభుత్వం. కుల సంఘాలను కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలు కూడా స్వీకరించనుంది. సామాజిక సాధికార సురక్ష కార్యక్రమంగా సమగ్ర కులగణనను చేపట్టేలా ప్రభుత్వం ముందుకెళ్లనుంది.
ఇదిలావుంటే, రానున్న ఎన్నికల కోసం రాజకీయ వ్యూహం రెడీ అవుతోంది. ఎవరి లెక్కలు వాళ్లవే.. మొత్తానికి కీలక సమయంలో ఏపీ కేబినెట్ భేటీ కీలకంగా మారింది. ఏపీలో కులగణనకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందరి బంధువుగా అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే ఏపీ కేబినెట్ కుల గణన నిర్ణయాన్ని ఆమోదించిందన్నారు మంత్రి వేణు గోపాల కృష్ణ. జిల్లాల వారీగా అన్ని కులసంఘాలు అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
