Watch: సుప్రీం తీర్పు టీడీపీ నేతలకు చెంపపెట్టు.. మంత్రి రోజా ఘాటు విమర్శలు
రిషికొండపై కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవాలని చూసిన టీడీపీ నేతలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపదెబ్బ లాంటిదన్నారు. విశాఖపట్నంపై టీడీపీ విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. రిషికొండపైనే సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుందన్నారు. చంద్రబాబుకు లేని జబ్బులు ఉన్నట్లు ప్రచారం చేశారని.. అందుకే కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు.
విశాఖపట్నంలోని రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం కోసం అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారని.. దీన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని కోరుటూ లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు.. దీనిపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని.. ఇది రాజకీయ ఫిర్యాదుగా సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఫైరయ్యారు. రిషికొండపై నిర్మాణాలను కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవాలని చూసిన టీడీపీ నేతలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపదెబ్బ లాంటిదన్నారు.
విశాఖపట్నంపై టీడీపీ విషం చిమ్ముతోందని మంత్రి రోజా ధ్వజమెత్తారు. రిషికొండపైనే సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుందన్నారు. చంద్రబాబుకు లేని జబ్బులు ఉన్నట్లు ప్రచారం చేశారని.. అందుకే కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. బెయిల్ వచ్చాక చంద్రబాబు అసలుా రూపం బయటపడిందన్నారు. చంద్రబాబు గతంలో తన సొంత మామని, ప్రజలను మోసగించారని.. ఇప్పుడు తనకు బెయిల్ ఇచ్చిన జడ్జిని కూడా మోసం చేశారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

