AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: షర్మిల నిర్ణయంతో సమీకరణాలు మారతాయా? బీఆర్ఎస్‌కు సరికొత్త అస్త్రాలు దొరికినట్టేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సెంటిమెంట్ అస్త్రం తెరమీదకు వచ్చింది. తెలంగాణ ద్రోహులంతా మళ్లీ ఏకమవుతున్నారంటూ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు వైఎస్‌ షర్మిల బేషరతు మద్దతు ప్రకటన అనంతరం హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ రాజేశాయి. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌టీపీ, జనసేన పార్టీలను మరోసారి టార్గెట్‌ చేసి ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది అధికార పార్టీ బీఆర్ఎస్‌.

Big News Big Debate: షర్మిల నిర్ణయంతో సమీకరణాలు మారతాయా? బీఆర్ఎస్‌కు సరికొత్త అస్త్రాలు దొరికినట్టేనా?
Big News Big Debate
Balaraju Goud
|

Updated on: Nov 03, 2023 | 7:14 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సెంటిమెంట్ అస్త్రం తెరమీదకు వచ్చింది. తెలంగాణ ద్రోహులంతా మళ్లీ ఏకమవుతున్నారంటూ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు వైఎస్‌ షర్మిల బేషరతు మద్దతు ప్రకటన అనంతరం హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ రాజేశాయి. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌టీపీ, జనసేన పార్టీలను మరోసారి టార్గెట్‌ చేసి ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది అధికార పార్టీ బీఆర్ఎస్‌.

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజే.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేకనే పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం సరైన నిర్ణయంగా భావిస్తున్నామని ప్రకటించారు షర్మిల. పాలేరులో కూడా పోటీకి దూరంగా ఉంటున్నట్టు వెల్లడించారు. షర్మిల నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. వైఎస్‌ఆర్‌ బిడ్డగా షర్మిల మరోసారి గర్వపడే పని చేశారన్నారు భట్టి విక్రమార్క.

షర్మిల ప్రకటనపై తీవ్రంగా స్పందించింది అధికార పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ద్రోహులంతా మరోసారి జాతీయ పార్టీల ముసుగులో వస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్‌రావు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌టీపీ పార్టీలు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు మంత్రి హరీష్.

బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత శక్తులను కూడగట్టడంలో భాగంగా చిన్నపార్టీల మద్దతు కోరుతోంది హస్తం పార్టీ. అటు జనసేన పార్టీ మాత్రం బీజేపీతో జతకడుతోంది. అయితే తెలంగాణ వ్యతిరేక శక్తులతో జాతీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని సెంటిమెంట్‌ అస్త్రం ప్రయోగిస్తోంది అధికార బీఆర్ఎస్‌. మరి ప్రజలు ఇంకా సెంటిమెంట్ అంశాన్ని ఎన్నికల అజెండాగా చూస్తున్నారా..?

ఇదే అంశంపై ఈరోజు బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌ జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి..

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో