Andhra News: నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా.. ఒర్నాయనో..
మన్యంలో గంజాయి సాగుపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రత్యేక దృష్టి సారించి గంజాయి సాగు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డ్రోన్లు ఉపయోగించి గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. అయితే మన్యంలో సాగుదార్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుండటంతో సాగు తగ్గిపోయింది. ఈ నేపధ్యంలోనే మైదాన ప్రాంతాల్లో సాగు మొదలవుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

మన్యంలో గంజాయి సాగుపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రత్యేక దృష్టి సారించి గంజాయి సాగు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డ్రోన్లు ఉపయోగించి గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. అయితే మన్యంలో సాగుదార్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుండటంతో సాగు తగ్గిపోయింది. ఈ నేపధ్యంలోనే మైదాన ప్రాంతాల్లో సాగు మొదలవుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు గంజాయి సాగును ధ్వంసం చేయడం కలకలం రేపింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం మొక్కపాడులో సాంబయ్య అనే రైతు ఎకరన్నర విస్తీర్ణంలో నిమ్మ తోట సాగు చేస్తున్నారు. అయితే, రెండు రోజులు క్రితం నిమ్మ తోటలో నుంచి పచ్చి ఆకును కోసి బ్యాగ్ లో సర్దుకొని ఇద్దరు యువకులు బయటకు వచ్చారు. అయితే అదే సమయంలో అక్కడ పోలీసులు ప్రత్యక్షమై ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకోవడంపై గ్రామంలో పెద్ద చర్చే నడిచింది. గ్రామస్థులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలిసాక ఆశ్చర్యపోతున్నారు. సాంబయ్య నిమ్మ తోటలో నిమ్మ మొక్కల మద్యలో గంజాయి మొక్కలను పెంచారు. అవి బాగా ఏపుగా పెరగడంతో ఆకులను కట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి విక్రయించాలని ప్లాన్ చేశారు.. ఈ ఉద్దేశంతోనే పచ్చి ఆకును కోసి తీసుకెల్తుండగా పోలీసులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.
ఇదే తరహాలో అచ్చంపేట రోడ్డులో ప్రత్తి మొక్కల మధ్య గంజాయి సాగు చేస్తుండగా.. పోలీసులు దాడి చేసి మొక్కలను ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలు ఏడాది కాలంలోనే చోటు చేసుకున్నాయి. వీటితో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మాచర్ల అన్నా క్యాంటిన్ వద్ద కూడా గంజాయి మొక్క ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.

Ganja Case
అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను పట్టించుకోకపోవడంతో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఈ నేపధ్యంలోనే గంజాయి సేవించే వారి వలన అక్కడ గంజాయి మొక్క మొలిచినట్లు ప్రచారం జరిగింది.
ఇలా.. ఇటువంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. మన్యంలో ఉక్కుపాదం మోపడంతోనే మైదాన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇంటిలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసుకొని ఈగల్ విభాగం ద్వారా గంజాయి సాగును తుద ముట్టించేందుకు కఠిన చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..