Itlu Mee Niyojakavargam: నేనే షంషేర్‌ అంటున్న కొడాలి.. నానిని ఢీకొట్టే మొనగాడే లేడా.. గుడివాడ పాలిటిక్స్‌లో గూస్ బంప్స్‌..

రాజ‌కీయ ఉద్దండుల‌కు పుట్టినిల్లు గుడివాడ‌.అన్న ఎన్టీఆర్ నుంచి మొద‌లు అటు పాలిటిక్స్,ఇటు సినిమా ఇండస్ట్రీలోకి వ‌చ్చిన హేమాహేమీలు చాలామంది ఇక్క‌డి వారే.తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు గుడివాడ‌.ఒక‌ప్పుడు టీడీపీ అంటేనే గుడివాడ‌...గుడివాడ అంటేనే టీడీపీ...సీన్ మారింది.సైకిల్ నుంచి ఫ్యాన్ కి చేంజ్ అయిపోయింది గుడివాడ‌.మ‌రి ఇక్క‌డ ప్ర‌స్తుత‌ రాజ‌కీయం ఎలా ఉంది...గుడివాడ పాలిటిక్స్ లో ఏం జ‌రుగుతోంది..?

Itlu Mee Niyojakavargam: నేనే షంషేర్‌ అంటున్న కొడాలి.. నానిని ఢీకొట్టే మొనగాడే లేడా.. గుడివాడ పాలిటిక్స్‌లో గూస్ బంప్స్‌..
Itlu Mee Niyojakavargam Gudivada
Follow us

|

Updated on: Mar 13, 2023 | 1:59 PM

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. అంతేకాదు, మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయమే అక్కర్లేదు. అప్పట్లో మొద‌టిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గుడివాడ‌కు ఎన్టీఆర్‌ ఏ స్థాయిలో పేరు తీసుకొచ్చారో… ప్రస్తుతం కొడాలి నాని కూడా ఏదోరకంగా నియోజకవర్గం పేరు తెలుగు ప్రజల నోళ్లలో నానేలా చేస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఈ మాస్‌ లీడర్‌.. మరోసారి విజయంపై ధీమాతో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌… ఇప్పుడు వైఎస్‌ కుటుంబానికి వీరవిధేయుడు… కొడాలి నానికి సంబంధించి ఈ రెండింటిలో దేన్నీ తక్కువ చేసి చెప్పలేం. ఎందుకంటే, ఆయన రాజకీయం మొదలెట్టింది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచే. అది కూడా… ఎన్టీఆర్‌ గతంలో ప్రాతినిథ్యం వహించిన గుడివాడ నుంచే తన ప్రస్థానాన్నిప్రారంభించారు. వైఎస్‌ హవాలోనూ.. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసిన కొడాలి నాని ఉరఫ్‌ కొడాలి శ్రీ వెంకటేశ్వర్రావు… ఆతర్వాత రూటు మార్చారు. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జగన్‌ వెనక నిలబడ్డారు. టీడీపీ దివంగత నేత హరికృష్ణ అనుంగు అనుచరుడు… యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాణమిత్రుడిగా పేరున్న కొడాలి… అలా విరుద్ధమైన పార్టీలోకి వెళ్లడం రాజకీయంగా సంచలనం రేపిందనే చెప్పాలి.

పార్టీ మారినా.. తన పట్టు మాత్రం నిలుపుకొన్న కొడాలి.. వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి గెలిచి… 2014నాటికి వైసీపీకి చేరువైన నాని… రాష్ట్ర విభజన తర్వాత వరుసగా రెండుసార్లు వైసీపీ జెండా ఎగరేశారు. ఇప్పుడు ఫ్యాన్‌ పార్టీకి హ్యాట్రిక్‌ విక్టరీ అందించేందుకు సై అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. తనను రాజకీయంగా ఎదురించే నాయకుడు గుడివాడలో ఇంకా పుట్టలేదంటున్నారు కొడాలి.

1983లో ఎన్టీఆర్‌ పోటీ.. గుడివాడలో టీడీపీకి బలమైన పునాది

ఒకప్పుడు గుడివాడ అంటే టీడీపీ… టీడీపీ అంటే గుడివాడ అన్నట్టుండేది పరిస్థితి. 1983లో తొలిసారి టీడీపీ తరపున ఎన్టీఆర్‌ పోటీచేసిన గెలవడంతో ఇక్కడ ఆ పార్టీకి బలమైన పునాది పడింది. ఒక్కసారి మినహా.. కంటిన్యూగా పసుపు జెండా ఎగరడం కామనైపోయింది. ఆ తర్వాత 2004నుంచి కొడాలి నాని, దాన్ని కంటిన్యూ చేశారు. ఎప్పుడైతే కొడాలి వెళ్లిపోయారో… అప్పట్నుంచి పార్టీ పరిస్థితి కొడిగట్టినట్టు తయారైందనే అభిప్రాయం ఉంది. కొడాలి స్థాయి బలమైన నాయకుడు టీడీపీ కరువయ్యాడనే చెప్పాలి. దీంతో అలనాటి వైభ‌వం కోసం పాకులాడుతోంది పసుపు పార్టీ. ఇక్కడ టీడీపీకి అతిపెద్ద సమస్య గ్రూపు తగాదాలే. బలమైన కొడాలినానిని ఢీకొట్టేందుకు అంతా ఒక్కటవ్వాల్సిన వేళ… ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు.

టీడీపీలో రావి వెంకటేశ్వర్రావు vs పిన్నమనేని వెంకటేశ్వర్రావు

ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వర్రావుకు… మాజీ మంత్రి పిన్న‌మ‌నేని వెంక‌టేశ్వ‌ర‌రావుకు అస్సలు పడట్లేదు. ఈ కలహాల వల్లే టీడీపీ వరుస ఓటములు ఎదుర్కొంటోందనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్ల నుంచే వ్యక్తమవుతోంది. అయితే, మరోసారి టిక్కెట్‌ కోసం ఈ ఇద్దరు నేతల మధ్య వార్‌ ముదరడంతో.. క్యాడర్‌ ఆందోళన చెందుతోంది. సీటు నాదంటే నాదంటూ కయ్యాలాడుకుంటూనే… ఎన్ని గ్రూపులున్నా.. కలిసిపోయి కొడాలిని ఓడిస్తామంటున్నారు టీడీపీ నేతలు.

వచ్చేసారి వార్‌ కొడాలి, రాము మధ్యేనా!

గుడివాడలాంటి పట్టున్న స్థానంలో పార్టీ వరుస ఓటముల పాలవడం సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్‌.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పుడు మరో కీలక నేతను రంగంలోకి దింపింది. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును.. వచ్చే ఎన్నికల బరిలో దింపాలని నిర్ణయించింది. దీంతో, పరిస్థితి కాస్తా… ఇద్దరు వెంకీల మధ్య కొత్తగా వచ్చిన రాము.. అన్నట్టుగా తయారైంది. అయితే, టీడీపీ హైకమాండ్‌ రామువైపే మొగ్గు చూపుతుండటంతో.. వచ్చేసారి వార్‌ కొడాలి వర్సెస్‌ వెనిగండ్లగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రాముది కమ్మ సామాజికవర్గం కాగా.. ఆయన భార్యది ఎస్సీ సామాజికవర్గం. దీంతో, కమ్మ ఓట్లతో పాటు.. భార్య వర్గం ఓట్లపైనా గురిపెట్టారు రాము. ఈ కొత్త ఈక్వెషన్‌ మీదే.. టీడీపీ గట్టి భరోసాతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి, వెనిగండ్లకు సీటిస్తే.. మిగితా ఇద్దరు నేతలు ఎంతవరకు సహకరిస్తారన్నదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను వేధిస్తున్న ప్రశ్న.

టీడీపీని మించి యాక్టివ్‌గా జనసేన!

ప్రధాన ప్రతిప‌క్షంలో త్రిముఖ పోరు నడుస్తుంటే… జనసేన ఇక్కడ యాక్టివ్‌గా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తోంది. కొడాలి నానికి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ త‌న ఉనికి చాటుకుంటోంది. నిజం చెప్పాలంటే.. ఇక్కడ టీడీపీ కంటే జనసేనే ఎక్కువ కార్యక్రమాలు చేసిందనే వారూ ఉన్నారు. అందుకే వచ్చేసారి ప్రభావం చూపించాలన్న కసితో పనిచేస్తున్నారు స్థానిక జనసేన నేతలు. అయితే, విపక్షాల పొత్తు ఖరారైతే.. జనసేన, టీడీపీల్లో ఎవరు బరిలో ఉంటారన్నది తేలాల్సి ఉంటుంది.

ఎస్సీలు ఎక్కువ… డామినేషన్ కమ్మ వర్గానిదే

గుడివాడలో ఎస్సీ మాలవర్గం ఓటర్లు ఎక్కువ. అయితే, రాజకీయంగా డామినేషన్ మాత్రం క‌మ్మ సామాజిక‌వర్గానిదే. కొన్ని దఫాలుగా ఆవర్గం నేతలే ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు. ఆ తర్వాత స్థాయిలో కాపు, యాదవ, గౌడ, కమ్మ ఓటర్లు ప్రభావశీలంగా ఉన్నారు. పునర్విభజనకు ముందు కమ్మ , యాదవ వర్గాలకు మధ్య పొలిటికల్‌ వార్‌ నడిచేది. కానీ, ఆ తర్వాత కమ్మ వర్గానికి సానుకూలంగా మారింది పరిస్థితి. నాలుగుసార్లు ఇక్కడ విజయం సాధించిన కమ్మ వర్గం నేత కొడాలికి.. ఎస్సీ, బీసీ, కాపు నేతలు అండగా నిలుస్తున్నారు. అయితే ఈసారి ఆయనకు కాపువర్గం కాస్త దూరంజరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే, కొడాలి నాని.. ఎస్సీ, బీసీ ఓట్ల మీదే భరోసా ఉంచినట్టు తెలుస్తోంది.

కొడాలిలో ఎంత దూకుడో.. అంత కలివిడి!

ప్రత్యర్థులపై ఒంటికాలి మీద లేచే కొడాలి నాని… చంద్రబాబు, లోకేశ్‌ల పేరెత్తితే చాలు చండ్రనిప్పులతో చెలరేగిపోతుంటారు. ఎంత దూకుడుగా ఉన్నా… స్థానికంగా ప్ర‌జ‌లతో మాత్రం క‌లివిడిగా ఉంటార‌నే పేరుంది. ఇదీ స‌మ‌స్య అని చెబితే చాలు… అది ఎంత కష్టమైనా పరిష్కరిస్తారనే అభిప్రాయం కొడాలిపై చాలా మందిలో ఉంది. అందుకేనేమో.. పార్టీలు కాదు, సొంత చరిష్మాతోనే ఆయన గెలుపు అంటుంటారు మెజార్టీ ఓటర్లు.

అభివృద్ధిపై కొడాలిది హైరేంజ్‌ కాన్ఫిడెన్స్‌

అభివృద్ధి విషయంలో కొడాలి కాన్ఫిడెన్స్‌.. హైరేంజ్‌ అనే చెప్పాలి. తాను చేసిన డెవలప్‌మెంట్‌తో మరోసారి బంపర్‌ మెజార్టీతో గెలుస్తానని… చంద్రబాబొచ్చి పోటీగా నిలబడినా గెలవలేడనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, టీడీపీ నేతల వెర్షన్‌ మాత్రం వేరేలా ఉంది.

కొడాలి అనుచరులపై ఆరోపణలు.. పార్టీలో గ్రూపులు

కొడాలి నానికి మైనస్సయ్యే అంశాలేం లేవా? అంటే నో అని చెప్పలేం. ప్రధాన అనుచరులపై అవినీతి ఆరోపణలు.. ఆయనకు మచ్చ తెస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాదు, అధికార పార్టీలో ఇక్కడున్న గ్రూపు తగాదాలూ ఇబ్బందికరంగానే మారాయి. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ కన్వీనర్‌ దుక్కిపాటి శశిభూషణ్‌ ఒంటెద్దు పోకడలపై సొంతపార్టీనేతలే సీరియస్‌గా ఉన్నారు. అయితే, ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయనే భావనలో ఉన్నారు కొడాలి.

4సార్లు గెలిచినా.. కొడాలి హయాంలో అభివృద్ధి జరగలేదా?

కొడాలినాని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా… అనుకున్నస్థాయిలో గుడివాడ అభివృద్ది జ‌ర‌గ‌లేద‌నేది ఆయన ప్రత్యర్థుల మాట. చాలా గ్రామాల్లో అందని తాగునీరు, దశాబ్దాలుగా మారని రహదారుల దుస్థితి, ఊసులేని రైల్వే బ్రిడ్జిల నిర్మాణం… పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణం.. లబ్దిదారులకు అందని టిడ్కో ఇళ్ళు.. నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టూ పూర్తికాకపోవడం… ఇలా చెప్పుకొంటూ వెళ్తే అమలు కాని ఎమ్మెల్యే హామీల లిస్టు చాంతాడంత కనిపిస్తోంది. అయితే దీనికి, అధికార పార్టీ చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయ్‌.

ప్రతిపక్షంలో గొడవలు కొడాలికి కలిసొస్తాయా?

కాసింత అభివృద్ధి… మరికొంత అసంతృప్తి… కొందరికి మోదం… మరికొందరికి ఖేదం… షరా మామూలుగా ప్రత్యర్థుల ఆరోపణల పర్వం.. ఎవరి వాదన ఎలా ఉన్నా… ప్రతిపక్షంలో కుంపట్లు.. కొడాలికి మరోసారి పట్టం కట్టేలా చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, చివరాకరికి విజేతను తేల్చేది గుడివాడ ఓటర్లే కాబట్టి.. ఎన్నికల నాటికి పరిస్థితి వారి మూడ్‌ ఎలా మారుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!