YSR Jagananna Colony : అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇళ్ళ స్థలం వస్తుంది.. బొత్స కీలక వ్యాఖ్యలు..

ఎండకు ఎండి వానకు తడిచి అద్దెంట్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలాకాలంగా తపనపడుతున్నారని

YSR Jagananna Colony : అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇళ్ళ స్థలం వస్తుంది.. బొత్స కీలక వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Dec 25, 2020 | 5:51 PM

ఎండకు ఎండి వానకు తడిచి అద్దెంట్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలాకాలంగా తపనపడుతున్నారని మున్సిపల్‌ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలకు పట్టాలివ్వడమే కాక, ఇళ్లు కట్టేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వమే ఇస్తుందని బొత్సా తెలిపారు. చీపురుపల్లిలో 475 మందికి పట్టాలు వచ్చాయని పేర్కొన్నారు బొత్స. గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత ఉంటే తొంభై రోజుల్లో ఇంటి స్థలం వస్తుందని  ఆయన తెలిపారు. పేదవాడికి ఇల్లు కట్టిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకెళ్తామంటున్నారు. పేదవాడికి ఇళ్లు ఇవ్వడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్లే తప్ప ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇళ్ల ఊసేలేదన్నారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారంటే ఆ పార్టీ ఎంత అవినీతికి పాల్పడిందో చెప్పనవసరం లేదు.. అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా ఉండి ఉంటే తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది అని అన్నారు బొత్ససత్యనారాయణ.  చంద్రబాబు ఐదేళ్లు పాలించారు. ఎవరికీ ఎలాంటి లబ్ధి చేకూరకుండా కేవలం వాళ్ల తాబేదారులకు మాత్రమే అన్ని పధకాలు అందేలా చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఓట్లడిగిన చంద్రబాబు చివరికి ఇవ్వకుండా మోసం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విడతల వారిగా ఇస్తామన్నారుని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం భూసర్వే చేస్తే చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ నుంచో ఎవరో వచ్చి మీ భూమి పట్టుకు పోతారని చెబుతున్నారు.  మీ భూమికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ఎక్కడా లేని విధంగా సర్వే చేయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని బొత్స పేర్కొన్నారు.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..