పేదోడి సొంతింటి కలే లక్ష్యం.. ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇచ్చిన సీఎం జగన్.. అవేంటంటే.!

YSR Jagananna Colony: ఏపీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా ఆయన...

పేదోడి సొంతింటి కలే లక్ష్యం.. ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇచ్చిన సీఎం జగన్.. అవేంటంటే.!
Follow us

|

Updated on: Dec 25, 2020 | 5:51 PM

YSR Jagananna Colony: ఏపీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీలో మోడల్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు” పైలాన్‌ను ఆవిష్కరించారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మందికి పైగా నివాస స్థల పట్టాలను అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ఇళ్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఈ పథకం కింద రెండు దశలలో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు. ఈ పధకం ద్వారా కోటి 24 లక్షల మంది లబ్దిదారులకు మేలు చేకూరుతుందని సీఎం జగన్ తెలిపారు. స్థలం మాత్రమే కాదు ఇళ్లు కట్టి ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇళ్ళ నిర్మాణంపై సీఎం జగన్ మూడు ఆప్షన్లు ఇచ్చారు.

  1. మొదటి ఆప్షన్: ప్రభుత్వ నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన సామాగ్రిని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడమే కాకుండా, లేబర్ ఛార్జీలకు డబ్బులు ఇస్తుంది.
  2. రెండో ఆప్షన్: ఇంటి నిర్మాణానికి కావల్సిన సామాగ్రిని లబ్దిదారులు తమకు నచ్చిన చోట కొనుగోలు చేస్తే.. ఆ డబ్బులను ప్రభుత్వమే దశల వారీగా చెల్లిస్తుంది.
  3. మూడో ఆప్షన్: ప్రభుత్వమే ఇంటి నిర్మాణాన్ని స్వయంగా పూర్తి చేసి.. లబ్దిదారులకు అందిస్తుంది.

కాగా, రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సీఎం.. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. పేద వాళ్లైన అగ్రకులాల వారికి సైతం ఇళ్ల నిర్మాణ చేపడుతున్నామన్నారు. ఈ పధకం సహాయం, ఫిర్యాదుల కోసం 1902కు కాల్ చేయాలని సూచించారు.

Also Read:

Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!

షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!