Vinayaka Chavithi: ఏపీలో వినాయక చవితి మండపాలపై ఆంక్షలు.. ప్రభుత్వం వివక్షత చూపుతోందని బీజేపీ నేతలు మండిపాటు

|

Aug 30, 2022 | 1:34 PM

వైసిపీ ప్రభుత్వం హిందూ పండుగులపై వివక్ష చూపుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. గణేష్ మండపాల నిర్వాహకులు ఎవరూ అనుమతులు తీసుకోవద్దని.. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఏపీలోని గణేష్ భక్తులకు సూచించారు. 

Vinayaka Chavithi: ఏపీలో వినాయక చవితి మండపాలపై ఆంక్షలు.. ప్రభుత్వం వివక్షత చూపుతోందని బీజేపీ నేతలు మండిపాటు
Vishnu Vardhan
Follow us on

Vinayaka Chavithi: ఆంధప్రదేశ్ లోని (Andhra Pradesh) గణేష్ ఉత్సవాలపై (Ganesh Festival) ప్రభుత్వం విధించిన ఆంక్షలపై ఏపీ బీజేపీ (BJP) ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. గణేష్ ఉత్సవాలపై ఆంక్షలను ఏపీ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గణేష్ మండపాల అనుమతి కోసం నాలుగు శాఖల వద్దకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. అదే ఇతర మతాల పండుగులపై ఇలాంటి ఆంక్షలు విధించగలరా అంటూ ప్రభుత్వాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. వైసిపీ ప్రభుత్వం హిందూ పండుగులపై వివక్ష చూపుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. గణేష్ మండపాల నిర్వాహకులు ఎవరూ అనుమతులు తీసుకోవద్దని.. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఏపీలోని గణేష్ భక్తులకు సూచించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..