MLA Ramanaidu: అధికారి వస్తారని ఎమ్మెల్యే నిరీక్షణ.. అధికారంలో లేకపోతే అంత అలుసా.. పాలకొల్లు ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ఎక్కడైనా ప్రజా ప్రతినిధి వస్తున్నాడంటే అధికారులు హడావుడిగా పరుగులు తీస్తారు. కానీ ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్...

MLA Ramanaidu: అధికారి వస్తారని ఎమ్మెల్యే నిరీక్షణ.. అధికారంలో లేకపోతే అంత అలుసా.. పాలకొల్లు ఎమ్మెల్యేకు చేదు అనుభవం
Palakollu Mla Nimmala Ramanaidu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2021 | 1:06 PM

Bitter experience for the Palakollu MLA Nimmala Ramanaidu: ఎక్కడైనా ప్రజా ప్రతినిధి వస్తున్నాడంటే అధికారులు హడావుడిగా పరుగులు తీస్తారు. కానీ ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్.. ప్రభుత్వ కార్యాలయానికి ఎమ్మెల్యే వస్తుంటే అధికారులు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. దీంతో ఆ ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చింది. అధికారులు వచ్చేవరకు ఆ కార్యాలయంలో నిరీక్షించి వచ్చాక అధికారులకు క్లాస్ తీసుకున్నారు.

పశ్చిమ గోదవరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేదు అనుభవం ఎదురైంది. గత రెండేళ్లుగా పాలకొల్లు మున్సిపల్ పరిధిలో పేరుకుపోయిన సమస్యలను మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌కు విన్నవించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్, ఇంజనీరింగ్ అధికారులు ఎవరు కనిపించలేదు. స్థానిక ఎయంసీ కార్యాలయం వద్ధ ఇతర నియోజకవర్గమైన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మున్సిపల్ రివ్యూలో పాల్గొన్నట్లు సమాచారం అందింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే రామానాయుడుకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే రావల్సిందిగా కబురు పంపాడు.

కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చేంత వరకూ వేచి చూశారు. వారు ఆఫీసుకి వచ్చాక తీవ్రస్థాయిలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న స్థానిక ఎమ్మెల్యేను కాదని, పొరుగు నియోజకవర్గ శాసనసభ్యునితో రివ్యూ పెట్టుకోవడమేంటని రుసరుసలాడారు. ప్రజల కష్టార్జితంతో పన్నులు కట్టిన నిధులను స్వప్రయోజనాలకు వినియోగించవద్దంటూ నిమ్మల తన సహజ ధోరణిలో అధికారులను హెచ్చరించారు.

నెల రోజుల గడువులో త్రాగునీరు, ఇళ్ల స్వాధీనం, రోడ్డు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు, అంబేద్కర్ భవన్, స్మశానవాటిక, హెల్త్ పార్క్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, రామగుండం పార్క్ వంటి పనులు పూర్తి చేయకపోతే ప్రజలతో, మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఎమ్మెల్యే చెప్పారు. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న విలువ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఉంటుందా.. పాలకొల్లులో ఇదే ఇప్పడుు హాట్‌టాఫిక్‌గా మారింది.

— రవి కుమార్, టీవీ 9 రిపోర్టర్, పశ్చిమగోదావరి జిల్లా