Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అర్థరాత్రి దెయ్యం పిలుస్తోందంటూ.. యువకుడి వింత ప్రవర్తన చూడండి

అర్ధరాత్రి ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. తనను ఎవరో పిలుస్తున్నారంటూ ఉరుకులు పరుగులు పెట్టాడు. తోటి యువకులతో గొడవకు దిగాడు.

Andhra Pradesh: అర్థరాత్రి దెయ్యం పిలుస్తోందంటూ.. యువకుడి వింత ప్రవర్తన చూడండి
Bihar Youth
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 28, 2022 | 4:14 PM

Krishna District: అర్ధరాత్రి ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. తనను ఎవరో పిలుస్తున్నారంటూ ఉరుకులు పరుగులు పెట్టాడు. తోటి యువకులతో గొడవకు దిగాడు. వారిలో వారు కొట్టుకున్నారు. అర్ధరాత్రి యువకుల వీరంగంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం(Gannavaram)లో చోటు చేసుకుంది. గన్నవరం రైల్వే స్టేషన్‌ సమీపంలో నివాసముంటున్న బీహార్‌ యువకులు అర్థరాత్రి హంగామా సృష్టించారు. యువకుల మధ్య చెలరేగిన వివాదంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకుంది. బీహార్(Bihar) నుండి పని కోసం వచ్చిన యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వీరి గొడవకు కారణం అడిగితే..మా వాడికి దెయ్యం పట్టిందని, ప్రతి అమావాస్యకి వాడు ఇలాగే దెయ్యం పట్టినట్టు వింతవింతగా ప్రవర్తిస్తాడని బీహార్ యువకులు ఆరోపించారు. అయితే, దెయ్యం లేదు, భూతం లేదు…ఫుల్లుగా తాగిన మద్యం మత్తులో అలా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వేళ అందరికి నిద్ర లేకుండా చేస్తున్నారని ప్రజలు మండిపడ్డారు.

తెలంగాణలో బీహార్ యువకుడి హత్య

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఓ బీహార్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. బీహార్‌కి చెందిన నిరంజన్ కుమార్(22)  పోచంపల్లి మండలం దోటిగూడెం గ్రామ శివారులోని రావూస్ లాబ్స్‌లో వర్క్ చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు డ్యూటీ పూర్తి చేసుకున్న అతను మందులు తెచ్చుకోవడం కోసం చౌటుప్పల్ వెళ్లాడు. రాత్రి అవుతున్నా అతను రూమ్‌కి తిరిగి రాలేదు. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. తెల్లవారు జామున చూస్తే కంపెనీ పక్కన ఉన్న వ్యవసాయ పొలం వద్ద కత్తిపోట్లతో హత్యకు గురై ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read:  వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్