Big News Big Debate: ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాయలసీమ వేదికగా సవాళ్లు నడుస్తున్నాయి.. ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్లతో దూకుడు పెంచారు. సెకండ్ డే కడప జిల్లా గండికోట రిజర్వాయర్‌ను సందర్శించి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలలో ప్రాజెక్టులకు మొత్తం 12వేల 441 కోట్లు ఖర్చు చేశామన్నారు టీడీపీ బాస్. వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు 2వేల 11 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విధ్వంసం జరిగిందంటున్నారు చంద్రబాబునాయుడు. వరదలో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును కూడా పునరుద్దరించలేకపోయారని ఆరోపించారు.
అటు చంద్రబాబునాయుడు పర్యటనలపై భగ్గుమంటున్నారు వైసీపీ నేతలు. సీమ ప్రాంతంపై చంద్రబాబుకు మమకారమే లేదన్నారు. 2014 నుంచి 19 మధ్యలో కుప్పంలో పాలారు ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోయారన్న మంత్రి పెద్దిరెడ్డి.. రాయలసీమ ప్రాజెక్టులపై పర్యటన కాకుండా చర్చకు రావాలన్నారు. ప్రాజెక్టుల సందర్శన కంటే చర్చకు వస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. పుంగునూరులో కాదు కుప్పంలోనైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అటు హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఐదు టీఎంసీలకు పరిమితం చేసిన ఘనత చంద్రబాబుది కాదా అంటూ ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యేలు.
అటు, రాయలసీమలో చంద్రబాబు పర్యటనలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. పులివెందులతో అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అటు పుంగనూరు వస్తే అడ్డుకుంటామని నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. వచ్చి తీరుతారని టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నేతల పర్యటనలు, వార్నింగులు ఎలా ఉన్నా 60 ఏళ్లుగా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదన్నది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ.
మరిన్ని ఏపీ వార్తల కోసం..