Bro Movie Controversy: గడిచిన కొద్దిరోజులుగా బ్రో సినిమాపై రచ్చ రచ్చ జరుగుతోంది.. ఏపీ రాజకీయాల్లో ఈ సినిమా పెద్ద చిచ్చునే రాజేసింది.. బ్రో సినిమాలో శాంబాబు క్యారెక్టర్‌తో మొదలైన రాజకీయ రచ్చ కాస్త ముదిరి బ్లాక్ మనీపైనా చర్చకు తెరతీసింది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టీడీపీ తరపున పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ ప్యాకేజీని రెమ్యూనరేషన్ రూపంలో ఇస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి అంబటి. ఇదో పెద్ద స్కామ్ అంటూ బాంబ్ పేల్చారు.
వ్యక్తులను టార్గెట్ చేసి సినిమాల్లో క్యారెక్టర్ పెట్టినంత మాత్రాన సినిమా హిట్ కాదన్నారు అంబటి. అటు దర్శక, నిర్మాతలు, రచయతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తామే ఒకరి జీవితంపై కొత్త సినిమా తీయబోతున్నామని ప్రకటించారు. ఇందుకోసం ఏడు పేర్లు పరిశీలిస్తున్నామన్న మంత్రి.. త్వరలోనే కథ ఫైనల్ చేస్తామన్నారు. కథా చర్చలు జరుగుతున్నాయని కూడా ప్రకటించారు.
మొత్తానికి మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గతంలో రాజకీయ నేతల పాత్రలతో సినిమాలు వచ్చాయి… పొలిటికల్ సటైర్లతో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. కానీ సినిమా పేరుతో పొలిటికల్ సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయంటూ తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. నిజంగానే రాజకీయశక్తులు ఇండస్ట్రీలో పనిచేస్తున్నాయా? బ్లాక్ మనీ పెట్టి మరీ సినిమాలు తీస్తున్నారా? తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీనూ రాజకీయ నేతలు వాడుకుంటున్నారా?