APPSC: ఏపీలో 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. నియామక ప్రక్రియ ఇదే

యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నత విద్యామండలి శనివారం (జులై 15) అన్ని యూనివర్సిటీల ఈసీలతో సమావేశం..

APPSC: ఏపీలో 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. నియామక ప్రక్రియ ఇదే
APPSC Assistant Professor Jobs

Updated on: Jul 17, 2023 | 1:02 PM

అమరావతి, జులై 17: యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉన్నత విద్యామండలి శనివారం (జులై 15) అన్ని యూనివర్సిటీల ఈసీలతో సమావేశం నిర్వహించింది. దాదాపు 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి, పాటించాల్సిన విధానంపై పాలకవర్గంలో చర్చించారు. ఉన్నత విద్యామండలి ఇటీవల వర్సిటీల్లో బోధన పోస్టుల హేతుబద్ధీకరణ నిర్వహించింది. దీని ప్రకారం కొన్ని పోస్టులు అవసరం లేనట్లు గుర్తించింది. ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో విద్యార్ధులు చేరడంలేదని కొన్ని చోట్ల ఆ కోర్సులను మూసివేశారు. ఈ పోస్టులు తగ్గిపోయే అవకాశం ఉంది.

స్క్రీనింగ్‌ పరీక్షలో ఓసీ, ఓబీసీలకు 40 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 35 శాతం మార్కులు రావాలి. పరీక్షలో వచ్చిన మార్కులతోపాటు అకడమిక్‌ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఒక్కో పోస్టుకు నలుగురి చొప్పున మౌఖిక పరీక్షలకు పిలిచే అవకాశం ఉంది. గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంఫిల్‌లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఉంటుంది. పీహెచ్‌డీ/జేఆర్‌ఎఫ్‌తో నెట్‌/స్లెట్‌/నెట్‌కు అదనంగా వెయిటేజీ ఉంటుంది. అకడమిక్‌ మార్కులకు 80, పరిశోధనకు 10, ఎక్స్‌పీరియన్స్‌కు 10 చొప్పున మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. స్క్రీనింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కులకు, అకడమిక్‌ మార్కులను కలిపి ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.