AP Weather Alert: ఏపీలో రాగాల 3 రోజులకు వాతావరణ సూచన.. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు
AP Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని దానిని ఆనుకుని ఉన్న ప్రాంతం లో నున్న ఉపరితల ఆవర్తనము ప్రభావం వలన అదే ప్రాంతం లో అల్పపీడనం..

AP Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని దానిని ఆనుకుని ఉన్న ప్రాంతం లో నున్న ఉపరితల ఆవర్తనము ప్రభావం వలన అదే ప్రాంతం లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టమునకు 4 .5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇది రాగల 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతం తో పాటు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి , ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరు కొనే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఈ కింది విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణము ఉంటుంది. రేపు. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాదు ఎల్లుండ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈ రోజు దక్షిణ కోస్తాఆంధ్రాలోతేలిక పాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: