Andhra Pradesh Weather Alert: రాగల రెండు రోజుల వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ సూచన
దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ కోస్తా తీరాలకు దగ్గరగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో
Andhra Pradesh Weather Report: దక్షిణ ఒడిస్సా – ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ కోస్తా తీరాలకు దగ్గరగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో “అల్పపీడనం” ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు ఏటవాలుగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియజేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:
> ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో వీచే అవకాశం ఉంది.
> రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో వీచే అవకాశం ఉంది.
> ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
> ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో వీచే అవకాశం ఉంది.
> రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో వీచే అవకాశం ఉంది.
> ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
> ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కడప, కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
> ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
Read also: Telangana Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 29, 30 తేదీల్లో తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్