Andhra Pradesh: కేసుల సత్వర పరిష్కారానికి జగన్ సర్కారు కీలక నిర్ణయం
'ఆన్లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టమ్' పేరిట ఒక కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
AP CS Adityanath Das – Online Legal Case Monitoring System: ‘ఆన్లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టమ్’ పేరిట ఒక కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా అన్ని డిపార్ట్‌మెంట్లలో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లైంది. కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి డిపార్ట్మెంట్లో ఒక నోడల్ అధికారి నియామకం చేయాలని నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి బాబుని నియామకం చేసింది.
ప్రస్తుతం హైకోర్ట్‌లో వినియోగిస్తున్న అప్లికేషన్ ప్రోటోకాల్ ఇంటర్ ఫేస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కేసులు పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. అన్ని గవర్నమెంట్ ప్లీడర్ కార్యాలయాల్లో ఆటోమేషన్ ఏర్పాటు చేసి, ఇకపై ఆయా డిపార్ట్మెంట్ కేసుల వివరాలు.. విచారణ తేదీలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అలర్ట్‌లు పంపనుంది ప్రభుత్వం. దీంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసుల వివరాలను డ్యాష్ బోర్డులో ఉంచాలని నిర్ణయించారు.
అంతేకాదు, వీటన్నింటినీ రియల్ టైంలో ప్రభుత్వం పర్యవేక్షణ చేయనుంది. ప్రస్తుతం తెలంగాణలో ఇటువంటి పద్దతి 5 డిపార్మెంట్‌లలో అమల్లో ఉంది. అదే విధానాన్ని ఏపీలో అన్ని విభాగాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కొన్ని రోజులు క్రితం న్యాయ శాఖ, ఇతర లా అధికారులతో సిఎస్ ఆదిత్య నాధ్ దాస్ సమీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయా శాఖల్లోని కోర్టు కేసులపై ప్రతి నెల ఆయా శాఖల హెచ్‌వోడీలతో సమీక్ష చేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు సిఎస్ ఆదిత్య నాద్ దాస్ ఈ సందర్భంగా ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.
Read also: Telangana Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 29, 30 తేదీల్లో తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్